నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది..! దంగల్ నటి సంచలన వ్యాఖ్యలు.! అసలేమైంది?     2018-05-28   00:06:19  IST  Raghu V

తనకిష్టం లేకపోయినా తండ్రి కోరిక ప్రకారమే ముష్టియుద్దానికి దిగిన పదిహేనేళ్ల ఆ పిల్ల ప్రత్యర్ది ఎవరున్నా లెక్క చేయకుండా తుక్కుతుక్కుగా చితక్కొట్టి,బరిలోకి దిగితే తనకెవరూ సాటి లేరు అన్నట్టుగా గీతా పొగట్ పాత్రలో ఒదిగిపోయింది నటి జైరా వసీం.దంగల్ సినిమా తర్వాత జైరా కి ఎన్నో అవకాశాలొచ్చాయి .వాటన్నింటిని కాదని సీక్రెట్ సూపర్ స్టార్ అనే సినిమా చేసింది జైరా.ఆ సినిమ ాలో తన నటనతో అందరిని ఆకట్టుకున్న జైరా తనకు ఆత్మహత్య చేసుకోవాలనుందంటూ పోస్టు పెట్టడం సంచలనం అయింది.

“కొన్ని రోజులుగా మానసికంగా కుంగిపోయాను. ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను. నాలుగేళ్లుగా ఏదో జబ్బు పీడిస్తున్నది. ఓ దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనిపిస్తున్నది .మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రతీరోజు ఐదు యాంటీ డిప్రెషన్ మెడిసిన్స్ తీసుకొంటున్నాను. ఒక్కోసారి విపరీతమైన బాధతో రాత్రిపూట కూడా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తున్నది. కొన్ని వారాల పాటు సరిగ్గా నిద్ర ఉండటం లేదు. కొన్ని సందర్భాల్లో విపరీతంగా నిద్రపోతున్నాను .ఇలాంటి మానసిక రుగ్మత వల్ల మితిమీరిన ఆహారాన్ని తీసుకొంటున్నాను. ఒక్కోసారి ఏదీ తినాలని అనిపించదు. కొన్నిసార్లు భోజనం చేయకుండా పస్తులతో ఉంటున్నాను. ఈ రుగ్మత వల్ల ఒంటినొప్పులు, శరీరం వాచిపోవడం వల్ల విపరీతమైన బాధ కలుగుతున్నది.