ఆమె మృతదేహాన్ని దహనం చేసారు...కానీ 27 రోజుల‌కు ఆమె మ‌ళ్లీ తిరిగి వ‌చ్చింది! అసలేమైంది?     2018-05-31   20:10:11  IST  Raghu V

ఎవ‌రికైనా త‌మ కుటుంబంలో ఉన్న ఎవ‌రైనా వ్య‌క్తి చ‌నిపోతే తీవ్ర‌మైన బాధ ఉంటుంది. దుఃఖం వ‌స్తుంది. అయిన‌ప్ప‌టికీ చ‌నిపోయిన వారి మృత‌దేహాల‌ను ఇంట్లో పెట్టుకోలేం క‌దా. ఖ‌న‌నం లేదా ద‌హ‌నం చేయాల్సిందే. అయితే ఆ త‌ల్లిదండ్రులు కూడా చ‌నిపోయింద‌ని చెప్పి త‌మ కూతురి మృత‌దేహాన్ని ద‌హనం చేశారు. త‌రువాత కొద్ది రోజుల‌కు కూతురు బ‌తికే ఉన్నానంటూ తిరిగి వ‌చ్చింది. దీంతో ఆ త‌ల్లిదండ్రుల‌కు ఒకేసారి ఆనందం, ఆశ్చ‌ర్యం క‌లిగాయి. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గ్రేట‌ర్ నోయిడాలో రాజ్‌, స‌ర్వేష్ దంప‌తుల కుమార్తె నీతూకు, అదే ప్రాంతానికి చెందిన రామ‌ల‌క్ష్మ‌ణ్‌కు వివాహం అయింది. అయితే రాజ్‌, స‌ర్వేష్‌ల‌కు ఓ కిరాణా షాపు ఉండేది. అందులో నీతూ అప్పుడ‌ప్పుడు కూర్చునేది. ఈ క్ర‌మంలో నీతూకు, షాప్‌కు వ‌చ్చే పూర‌ణ్ అనే వ్య‌క్తికి మ‌ధ్య వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. దీంతో ఏప్రిల్ 6వ తేదీన నీతూ ఇంట్లో చెప్ప‌కుండా గ‌ప్ చిప్‌గా పూరణ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి అక్క‌డే కాపురం పెట్టింది.