హీరో అయ్యేవాడు.. ఆమె వల్ల ఇంట్లోనే కూర్చుండి పోయాడు  

తెలుగు మీడియాలో మొన్నటి వరకు శ్రీరెడ్డి ఏ స్థాయిలో మారు మ్రోగి పోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీరెడ్డిని మా ఛానెల్‌ డిస్కషన్‌ రమ్మంటే మా ఛానెల్‌ డిస్కషన్‌కు రమ్మంటూ పలు ఛానెల్స్‌ వారు భారీ మొత్తం ఆఫర్‌ చేసి మరీ పిలిచారు. అయితే ప్రస్తుతం ఆమెను ఛానెల్స్‌ వారు పిలవడం లేదు. ఆమె చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల వల్ల సెలబ్రెటీలు ఛానెల్స్‌పై విరుచుకు పడుతున్నారు. ఆ కారణంగానే ఆమె ఛానెల్స్‌లో కనిపించడం లేదు. అయితే ఆమె సోషల్‌ మీడియాలో మాత్రం తెగ వినిపిస్తుంది. శ్రీరెడ్డి వల్ల పలువురి జీవితాలు తల కిందులు అయ్యాయి, ముఖ్యంగా దగ్గుబాటి సురేష్‌బాబు చిన్న కొడుకు అభిరామ్‌ పూర్తిగా కనుమరుగయ్యాడు.

సురేష్‌బాబు వారసుడిగా అభిరామ్‌ హీరో అవ్వాలనుకున్నాడు. అందుకోసం గత రెండు సంవత్సరాలుగా ఎంతో కష్టపడి బాడీని ఫిట్‌గా మార్చుకోవడంతో పాటు, చిన్నచిన్న ఆపరేషన్స్‌తో మొహం అందంగా తయారు చేయించుకున్నాడు. త్వరలోనే అభిరామ్‌ సినిమా మొదలు అవుతుందని భావిస్తున్న సమయంలో శ్రీరెడ్డి ఫొటోలు విడుదల చేయడంతో పాటు, ఆయనపై తీవ్ర స్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి సంచలన సృష్టించింది. అభిరామ్‌ నన్ను వాడుకున్నాడు అని, ప్రేమించాను అంటూ మోసం చేశాడు అంటూ శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది. తనకు అవకాశాలు ఇప్పిస్తాను అంటూ మోసం చేసిన అభిరామ్‌ను వదిలి పెట్టను అంటూ హెచ్చరించింది.