Cut down smartphone usage .. enjoy these benefits

రోజుకి ఎన్ని గంటలు స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం ? ఎప్పుడైనా గమనించారా ? పొద్దున్న లేవగానే చేతులు దానిమీదకే వెళతాయి, చాలామందికి ఇప్పుడు బాత్ రూమ్ లో కూడా సెల్ ఫోన్ కావాలి, ఫేస్ బుక్ మీద కాసేపు, ట్విట్టర్ మీద కాసేపు, వాట్సాప్ మీదా కాసేపు, ఇతర బ్రౌజింగ్ మీద కాసేపు, ఇక ఇంటరెస్ట్ ఉంటే గేమ్స్, సినిమాలు, అటు చేసి ఇటు చేసి, రోజుకి కనీసం 4-5 గంటలు అయినా స్మార్ట్ ఫోన్ మీద బ్రతికేస్తున్నాడు మనిషి. కనీసం అన్నాం కాబట్టి ఈ లెక్క ఇంకా పెరగవచ్చు. కాని ఇలా విపరీతమైన స్మార్ట్ ఫోన్ వాడకం వలన మీ శరీరానికి మీరు ఎంత హాని చేసుకుంటున్నారో ఆలోచించారా ? స్మార్ట్ ఫోన్ వాడటం తగ్గిస్తే ఎంతవరకు మీ శరీరం, మనసు ఎంత బాగుపడతాయో తెలుసా ?