క్రేజీ హీరోయిన్ ని లైంగికంగా వేధించిన డైరెక్టర్ ?  

ఆమె ఒక క్రేజీ హీరోయిన్. పారితోషికం 50 లక్షల పైమాటే. ఓ రెండేళ్లుగా సక్సెస్ ఫుల్ గా సాగిన కెరీర్ ఒక్కసారిగా నెమ్మదించింది. దానికి కారణం గత ఏడాది వచ్చిన ఓ పెద్ద బ్లాక్ బస్టర్ తరువాత ఆమెకి ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దక్కకపోవడం. హిట్ పక్కనపెడితే వరుస డిజాస్టర్లు వచ్చిపడ్డాయి. ఇలాంటి తరుణంలో బ్లాక్ బస్టర్స్ తో ఊపుమీద ఉన్న ఒక క్రేజీ హీరోతో నటించే అవకాశం వస్తే ఎవరు ఆ అవకాశాన్ని వదిలేసుకోవాలనుకుంటారు? కాని ఈ హీరోయిన్ ఆ ప్రాజెక్టు నుంచి బయటకి వచ్చేసింది. చేసుకున్న అగ్రిమెంట్ క్యాన్సల్ చేసుకొని మరి బయటకి వచ్చేసింది. ఒక టాప్ ప్రొడ్యూసర్ తో, ఒక అగ్రనిర్మాతతో గొడవ పెట్టుకొని మరి ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఇదేంటి ఇలాంటి పిచ్చి పని చేసింది అని చాలామంది ఆశ్చర్యపోయారు. కాని తప్పనిసరి పరిస్థితులో ఆ సినిమా వదిలేసుకోవాల్సి వచ్చింది పాపం ఆ హీరోయిన్.

ఆ సినిమా డైరెక్టర్ ఈ హీరోయిన్ ని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడట. తన కోరిక తీర్చమని పదే పదే టార్చర్ పెడుతున్నాడట. ఆ వేధింపులు తట్టుకోలేకే అమ్మాయి అర్థాంతరంగా సినిమా వదిలేసిందని, బయటకి మాత్రం వారి పరువు తీయడం ఇష్టం లేక వేరే కారణాలు చెబుతోందని ఫిలింనగర్ లో బలమైన టాక్ వినిపిస్తోంది.

అసలే అడపాదడపా ఒకటి రెండు హిట్స్ తో బండి లాక్కోస్తున్న దర్శకుడు అతను. ఒక స్టార్ హీరో అవకాశం ఇచ్చినా సరిగా వినియోగించుకోలేకపోయాడు ఒకప్పుడు. ఇలాంటి తరుణంలో బుద్ధిగా పనిచేసుకోవాల్సింది పోయి ఇలా హీరోయిన్ తో చేదుగా ప్రవర్తించడం ఏమిటో, ఈ దర్శకుడు ఇలా చేస్తున్నాడు అని తెలిస్తే రేపు స్టార్ హీరోలు అవకాశం ఇస్తారా? హీరోయిన్లు డేట్స్ ఇస్తారా అంటూ వాపోతున్నారు సినీ ప్రజానీకం.