నెంబర్1 పగటి వేషగాడిగా చంద్రబాబు!!     2015-02-04   23:48:01  IST  Bhanu C

CPI narayana Fires on Chandrababu

సీమాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారం పై మునుపెన్నడూ లేని విధంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఆయన 9ఏళ్ల పాలన చేసినప్పుడు కూడా అనేక వేమర్శలు ఎదుర్కున్నప్పటికీ..ఆ పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మరింత దారుణంగా ఉండడంతో పాపం చంద్రబాబుకు ఈ ఇబ్బందులు తప్పడం లేదు…అనుకున్నంత కాకపోయినా..చెప్పిన మాటకు కట్టుబడి..రునమాఫీ చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతానికి దిగుతున్నాయి..ఎన్నికల ముందు అసలు రుణ మాఫీ అనేది సాధ్యం కాదు అని ప్రగల్భాలు పలికిన జగన్ బాబు ఇప్పుడు అదే రుణ మాఫీని అమలు చేయాలి అని ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తూ దీక్షలు చేయడం ఒకింత హాస్యాస్పదం అనే చెప్పుకోవాలి..ఇదిలా ఉంటే మరో పక్క కామ్రెడ్స్ కూడా బాబు పై విమర్శల వెల్లువ కురిపిస్తున్నారు..సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ,సీనియర్ నేత డాక్టర్ కె.నారాయణ తన నాలుకకు పదును పెట్టి మరి బాబుపై నోరుజారారు…కర్నూలు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో నారాయణ మాట్లాడుతూ…ఎన్నికల ముందు లెక్కలేనన్ని వాగ్దానాలు చేసి తన మాయ మాటలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత నిట్టనిలువునా మోసం చేస్తున్నారని, అంతేకాకుండా చంద్రబాబు కు జగన్ ఫోబియా పట్టిందని, ముఖ్యమంత్రి హోదాలో చేసిన మొదటి ఐదు సంతకాలలో ఒక్క దానికి కూడా దిక్కు లేదని, రాజధాని పేరుతో రోజుకో మాట చెబుతున్న రాష్ట్రంలో చంద్రబాబు నెంబర్ ఒన్ పగటి వేషగాడిగా ఎన్నిక అవుతారని నారాయణ తీవ్రమైన విమర్శలు చేశారు. మరి దీనిపై పసుపు దళం ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి.