పవన్ కి ఓ దణ్ణం పెట్టి తప్పుకోనున్న “వామపక్షాలు”..రీజన్ ఇదే     2018-04-18   00:49:00  IST  Bhanu C

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే గుంటూరు బహిరంగ సభలో చంద్రబాబు ని టార్గెట్ గా చేసుకుంటూ విమర్శలు సంధించారో అప్పటి నుంచీ పవన్ కి బ్యాండ్ టైం స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు..అయితే పవన్ తెలంగాణా నుంచీ బస్సు యాత్ర మొదలు పెట్టక ముందు కత్తి మహేష్ వ్యవహారంలో పరువు పోగొట్టుకున్నాడు..ఆ సమయంలో కత్తి చేసే వ్యాఖ్యలకి జనసేన దగ్గర కౌంటర్ ఇవ్వడానికి కూడా సమాధానాలు ఉండేవి కావు..తరువాత ఆ గొడవ రాజీతో సమసిపోయింది అయితే.

తాజాగా శ్రీ రెడ్డి విషయంలో పవన్ కళ్యాణ్ స్పందన అడిగిన మీడియా వారితో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని మరో వివాదంలోకి నేట్టేశాయి..ఆమె అలా చేయకుండా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అని చెప్పడంతో శ్రీ రెడ్డి రెచ్చిపోయింది దాంతో .శ్రీ రెడ్డి మొదలు చాలా మంది పవన్ పై ఆరోపణలు చేస్తున్నారు..అయితే ఈ విషయంలో పవన్ అభిమానులు కూడా రెచ్చి పోతున్నారు..అయితే పరిస్థితి మరింత చేజారిపోయేలా ఉండటంతో జనసేన స్పందించింది..పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం రాజకీయ కుట్రగా అభివర్ణించింది..ఈ వ్యాఖ్యల వెనుక టిడిపి పార్టీ ఉందేమో అనే అనుమానాలు పవన్ అభిమానులు కూడా వ్యక్తం చేశారు..