ఏడాది లోపు పసిపిల్లలకు ఆ పాలు తాగిస్తే ప్రమాదం అంట

అంత చిన్న వయసులో ఆవుపాలు పట్టి ఎలాంటి లాభం ఉండదు. ఎందుకంటే అంత ప్రోటీన్ ని పసిదేహం తీసుకోలేదు. అలాగే ఆవుపాలలో ఐరన్ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి, పసివారి శరీరంలో రక్తం తక్కువగా పుడుతుంది. దీనిమీద డాక్టర్ నందన్ జోషి మాట్లాడుతూ “ఆవుపాలు తాగడం ఓరకంగా చెప్పాలంటే మన సంప్రదాయంలో భాగం. ఆవుపాలు మనిషి శరీరానికి లాభాలే తప్ప, ఎలాంటి నష్టం చేయవు అని నమ్ముతారు. మతప్రభావం వలన అలా అనుకుంటారేమో. కాని పసిశారీరానికి ఆవుపాలు మంచివి కావు. ఆవుపాలు వారి శరీరంలో సరిగా జీర్ణం కూడా కావు. పసివారి కిడ్నీలు ఆవుపాలను భరించలేవు. చాలా ప్రెషర్ పడుతుంది. పిల్లలో మిల్క్ ఎలర్జీ ఉంటుంది. వారికి తల్లి పాలు ఇవ్వడమే మంచిది. అలా వీలు కాకపోతే న్యూట్రిషన్ నిపుణులని అడిగి మరో మార్గం ఆలోచించండి కాని ఆవుపాలను మాత్రం పట్టవద్దు. ఆవుపాలు పిల్లలకు పట్టడడం వలన మరో ఇబ్బంది ఏమిటంటే, పసివారికి బైలు పెడుతుంది. దాంతో చాలా ఇబ్బందిపడతారు. పసి శరీరాలకి అంత టార్చర్ అవసరమా” ? అంటూ ఒక న్యూట్రిషన్ సమ్మిట్ లో చెప్పుకొచ్చారు.

ఇంతమాత్రమే కాదండోయ్, ఆవుపాలని పసివారికి పట్టడం వలన స్కిన్ రాషేస్ వస్తాయి. విరేచనాలు, వాంతులు, ఎజిమా, శ్వాస సంబంధిత సమస్యలు, రోగనిరోధకశక్తి సంబధిత సమస్యలు కూడా వస్తాయి. ఈ టాపిక్ మీద, ఆవుపాలతో పసివారికి వచ్చే సమస్యల మీద Rapid Survey on Children (RSOC) మీద ఓ పెద్ద రిపోర్ట్ ని కూడా సపోర్ట్ చేసింది. జైపూర్ కి చెందిన ప్రముఖ గర్భనిపుణులు లలిత్ భారడియా కూడా ఈ సమ్మిట్ లో పాల్గొని ఆవుపాలని పిల్లలకు పట్టవద్దని తల్లులని హెచ్చరించారు.