ఏడాది లోపు పసిపిల్లలకు ఆ పాలు తాగిస్తే ప్రమాదం అంట  

ఒక ఆహారపదార్ధం ఎంతమంచిదైనా కావచ్చు, కాని అది ప్రతి మనిషికి పడాలని లేదు. మంచి ఆహారపదార్థాలు కూడా మన వయసు, ఆరోగ్యాన్ని బట్టి తీసుకోవడం, తీసుకోకపోవడం చేయాలి. రోజుకి రెండు కప్పుల కాఫీ మంచిదే కావచ్చు, కాని అదే కాఫీని గర్భిణి స్త్రీలు తాగకపోవడమే మంచిది. అప్పటి ఆరోగ్యస్థితి అలాంటిది అన్నమాట. ఆవుపాలలో ఎన్ని పోషక గుణాలు ఉంటాయి? ఎంత రుచి ఉంటుంది. ఆవుపాల వలన హాని ఉంటుందా, ఉండే అవకాశం ఉంటుందా? మన వయసు వారికి, మన కన్నా పెద్ద వారికి, టీనేజర్ వారికి, చిన్న పిల్లలకి కూడా ఆవు పాలు మంచివే కావచ్చు, కాని పసిపిల్లలకు ఆవుపాలు మంచివి కావు అంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా ఏడాదిలోపు పసిపిల్లకు ఆవుపాలను పట్టవద్దు అని హెచ్చరిస్తున్నారు. ఎందుకు ఇలా? చదివి తెలుసుకోండి.

ఏడాదిలోపు పసివారికి తల్లిపాలు పట్టడమే అన్ని విధాలా శ్రేయస్కరం. కాని బిజీగా ఉండే తల్లులు వేరే మార్గాలతో పిల్లలకి పాలుపడుతుంటారు. కొందరు ఆవుపాలను పడుతూ ఉంటారు. కాని ఇది మంచి పని కాదు అంటున్నారు న్యూట్రిషన్ నిపుణులు. ఏడాదిలోపు పసివారికి ఆవుపాలను పట్టడం అంటే రకరకాల ఎలర్జీలకు ఛాన్స్ ఇవ్వడమే అంట. కొన్నిసార్లు ఆవుపాలు పసివారి ఊపిరితిత్తులలో, జీర్నవ్యవస్థలో సమస్యలు తీసుకొచ్చే అవకాశాలున్నాయి.