Coverts in Chandrababu Cabinet

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ‌తీసేందుకు, అక్క‌డి వ్యూహాలు ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకునేందుకు వేగులు ఉంటుంటారు. ఆ పార్టీలో ప్ర‌త్య‌ర్థి పార్టీల వేగులు ఉంటే, ప్ర‌త్య‌ర్థి పార్టీల్లో అపొజిష‌న్ వేగులు ఉండ‌డం కామ‌న్‌. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఏపీలో చంద్ర‌బాబు కేబినెట్‌లోనే సాక్షాత్తూ కోవ‌ర్టులు ఉన్న‌ట్టు, ఈ విష‌యం చంద్ర‌బాబు కూడా గ్ర‌హించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

బాబు త‌న కేబినెట్‌లోని మంత్రి గంటా శ్రీనివాస‌రావు వైఖ‌రిపై ముందునుంచి అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఆయన ఇప్పటికే ప‌లు పార్టీలు మారి టీడీపీలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా గంటాపై చంద్ర‌బాబుకు ఉన్న అనుమానాల‌పై ప‌వ‌న్‌క‌ళ్యాణ్ భేటీతో క్లారిటీ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

చంద్ర‌బాబుతో భేటీలో ప‌వ‌న్ సీఆర్డీఏ తీసుకున్న కొన్ని సీక్రెట్ డెసిష‌న్ల‌ను కూడా చెప్ప‌డంతో చంద్ర‌బాబు షాక్ అయిపోయార‌ట‌. ఈ విషయాలు ఎవరు చెప్పారని అడగకున్నా చంద్రబాబుకు ఇది గంటాశ్రీనివాసరావు పనేనని అర్ధమయింది. వాస్త‌వానికి గంటా శ్రీనివాస‌రావు విష‌యంలో చంద్ర‌బాబు ముందు నుంచి తీవ్ర అసంతృప్తితోనే ఉంటున్నారు.