ఆ జంట కారులో అమెరికా టూ హైదరాబాద్‌ వచ్చారు.! అదెలా సాధ్యం అయ్యిందో తెలుసా?     2018-06-10   00:14:27  IST  Raghu V

కారులో షికారు అంటే చాలా మందికి ఇష్టమే. ఎంత దూరమైనా సరే వెళ్ళిపోతూ ఉంటారు ట్రావెల్లెర్స్. అయితే కార్ లో అమెరికా నుండి హైదరాబాద్ కి ప్రయాణం అంటే అసాధ్యం అనే చెప్పాలి. ఎందుకంటే మధ్యలో సముద్రం ఉంది. కానీ ఆ జంట అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. ఎలాగా అని ఆశ్చర్యపోతున్నారా.? వివరాలు మీరే చూడండి!

కాలిఫోర్నియాలోని గృహం నుంచి హైదరాబాద్‌లోని ఇంటి వరకూ కారులో ప్రయాణించాలని నిర్ణయించారు. 37 ఏళ్ల వైవాహిక జీవితంలో కోల్పోయిన ఎన్నో మధుర క్షణాలను వడ్డీతో సహా కలిపి మూడు నెలల్లో 37 వేల కిలోమీటర్ల ప్రయాణంలో సంపాదించారు.

హైదరాబాద్‌కు చెందిన డా. రాజేశ్‌ కడాకియా, డా. దర్శనలు వృత్తి రీత్యా అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. 63 ఏళ్ల రాజేశ్‌ కడాకియా(ఎండీ, ఎఫ్‌ఏసీఈపీ) ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెడిసిన్‌, జనరల్‌ సర్జన్‌లో పట్టా పొందారు. అనంతరం లండన్‌లోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ నుంచి ఎఫ్‌ఆర్‌సీఎస్‌-1 పూర్తి చేశారు. ఎల్‌ఆర్‌సీపీ అండ్‌ ఎమ్‌ఆర్‌సీఎస్‌లో అడిషనల్‌ డిగ్రీలు కూడా పొందారు. 1987 నుంచి ఫిజీషియన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా తీరికలేనంత బిజీగా జీవితం గడిచిపోయింది. 37 ఏళ్ల వైవాహిక జీవితంలో కేవలం 37 రోజులు మాత్రమే కలిసివున్నారు. డాక్టర్లుగా ప్రజలకు ఇద్దరూ ఎంత సేవ చేసినా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఏదో తెలీని వెలితివారిని వెంటాడేది. తాము కోల్పోయిన సంతోషాలను, ఆనందాలను తిరిగి పొందేందుకు ఆరు పదుల వయసులో ఈ జంట భారీ అడ్వెంచర్‌ ట్రిప్‌కు శ్రీకారం చుట్టింది.