కెమెరాకు చిక్కిన వింత సంఘటన.! రోడ్డుపైనే మత్తుగా ఆ యువతి యువకులు.!  

తెలుగు రాష్ట్రాల్లో వర్షం భీబత్సం సృష్టిస్తుంది. ఇక భాగ్యనగరంలో అయితే చెప్పనక్కర్లేదు. కొద్దిగా వర్షం పడితేనే ఒక రేంజ్ లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటిది వరుసగా పడుతూ ఉంటె ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంతా కాదు. ఇలాంటి వర్షంలో వేడి వేడిగా ఏదైనా తింటే వచ్చే ఆ ఫీల్ ఏ వేరు అనుకుంటారు చాలా మంది. రోడ్ సైడ్ ఉండే మిర్చి బందీలకు, మొక్క జొన్నలకు ఈ టైం లో గీరాకి పెరిగిపోతూనే ఉంటుంది. కానీ ఓ యువతి యువకుడు మాత్రం మద్యం తాగుతూ, గంజాయి పీలుస్తు కెమెరాకు చిక్కారు.
అబిడ్స్‌ రోడ్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలిఫోన్‌ ఎక్సెంజ్‌ వద్ద ఈ సన్నివేశం చోటు చేసుకుంది.

ఎవరేమనుకుంటే తమకేంటి అన్నట్టుగా వారిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ‘చుక్కే’శారు. మూసి ఉన్న దుకాణం ముందు తాపీగా కూర్చుకుని మందు మజాతో విందు చేసుకున్నారు. మత్తు సరిపోలేదో, కిక్‌ ఇంకా కావాలనుకున్నారో తెలియదు కానీ మద్యానికి గంజాయి, సిగరెట్‌ జత చేసుకున్నారు. లోకమంతా మరిచి మత్తులో మునిగి తేలారు. పబ్లిగ్గా మందేస్తున్న చుక్క, చక్కనోడిని చూసి ఆ దారిన పోయే వారంతా నోళ్లు వెళ్లబెట్టారు. ఇదేం చోద్యమంటూ గుసగుసలాడారు. గ‘మ్మత్తు’ అంటే ఇదేనేమో!