కూల్ డ్రింక్స్ త్రాగుతున్నారా.... అయితే పెద్ద ప్రమాదంలో పడినట్టే     2018-05-07   23:29:42  IST  Lakshmi P

ఎండలు పెరిగిపోయాయి. బయటకు వెళ్లాలంటేనే వడదెబ్బ తగులుతుందని భయం వేస్తుంది. చాలా మంది ఇల్లు వదిలి బయటకు రావటం లేదు. కానీ కొంత మంది పనుల కారణంగా బయటకు వస్తున్నారు. అలాంటి వారు వేసవి తాపాన్ని తగ్గించుకోవటానికి కూల్ డ్రింక్స్ త్రాగుతున్నారు. వేసవి కాలంలో కూల్ డ్రింక్స్ శక్తిని ఇస్తాయని,దాహం తీరుతుందని భావించి కాస్త ఎక్కువగానే త్రాగేస్తున్నారు. అయితే కూల్ డ్రింక్స్ ఎక్కువగా త్రాగటం వలన చాలా రకాల సేడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

కూల్ డ్రింక్స్ ఎక్కువగా త్రాగటం వలన వాటిల్లో ఉండే చక్కర ఎక్కువగా కేలరీలను ఇస్తుంది. దాంతో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కూల్ డ్రింక్స్ లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. కెఫీన్ మోతాదుకు మించితే శరీరంపై దుష్ప్రభావాలను చూపుతుంది. గుండె కొట్టుకొనే తీరులో మార్పులు,రక్తపోటు పెరగటం, కొన్ని సందర్భాలలో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండటమే మంచిది.