డైలీ ఇవి తింటే..గుండె జబ్బులు రావు  

డ్రై ఫ్రూట్ మనిషి శరీర క్రమాన్ని ఒక పద్దతిలో గతి తప్పకుండా చేస్తాయి..శరీరానికి శక్తి అవసరం ఐనప్పుడల్లా వీటిని తింటే అధిక ప్రోటీన్స్..విటమిన్స్ శరీరానికి అందుతాయి..తద్వారా ఎప్పుడూ ఆరోగ్యం బాగుంటుంది ప్రతీరోజు డైట్‌లో వాల్‌నట్స్, బాదం, వేరుశెనగలు వంటివి తీసుకుంటే ఒబిసిటీని దూరం చేసుకోవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది.

అధిక బరువు సమస్య ప్రస్తుతం అనేకమందిని వేధిస్తోంది.అందువలన పండ్లతో పాటు నట్స్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గుతారని పరిశోధకులు అంటున్నారు. వీటిని రోజూ తీసుకోవడం ద్వారా అధిక బరువుతో ఏర్పడే అనారోగ్య సమస్యలు దూరమైనట్లు వైద్యుల పరిశోధనలో తేలింది.

నట్స్ ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి శక్తి, మంచి కొలెస్ట్రాల్, ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్, పైటోకెమికల్స్ వంటివి లభిస్తాయి. వృద్ధుల్లో మతిమరుపును కూడా నట్స్ దూరం చేస్తాయి. వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తాయి.గుండెకు సంబంధించిన వ్యాధులు..గుండెపోటు వంటి ప్రాణాపాయ వ్యాధులు రాకుండా కాపాడటంలో ఇవి ముఖ్యంగా ఉపయోగపడుతాయి.