హస్తినకు 'హస్తమే' కీలకం     2015-02-05   01:27:25  IST  Bhanu C

Congress will be KING Maker in Delhi

దేశ రాజధాని ఎన్నికలు మూడు పార్టీలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.. సర్వేలన్నీ..ఆప్ కు మద్దతు ఇస్తుంటే….బుకీలు మాత్రం బీజేపీనే తమ ‘ఫేవరెట్’గా చెబుతున్నారు..ఇదిలా ఉంటే..అధికారం ఖాయం అంటూ ఆప్ మరియు బీజేపీ చెబుతునప్పటికీ హంగ్ ఏర్పడే సూచనలు సైతం అక్కడక్కడా కనిపిస్తున్నాయి..ఇక అదే నిజం అయితే మాత్రం మల్లు హస్తినకు హస్తం కీలకం కానుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..అయితే అదే జరిగితే కనుక, మళ్లీ ఆప్ హస్తం చేతిలో తమ హస్తాన్ని ఉంచి పాలన సాగించాల్సిన అవసరం మళ్లీ వస్తుంది… గత ఎన్నికల్లో కొంగ్రెస్ పైనే పోటీ చేసి..ఫలితాల తరువాత అదే కొంగ్రెస్ మద్దతుతో అధికారాన్ని కైవసం చేసుకుంది ఆప్ పార్టీ. మరి ఇప్పుడు అదే సీన్ రిపీట్ కానుంధా అంటే అవును అనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే బుకీలు చెబుతున్న వివరాల ప్రకారం…ఆమ్ ఆద్మీ పార్టీకి 27 నుంచి 28 స్థానాలు దక్కుతాయి. బీజేపీకి 38 నుంచీ 39 స్థానాలు దక్కుతాయి. కాంగ్రెస్కు కేవలం 3 లేదా 4 స్థానాలు దక్కుతాయట. ఏది ఏమైనా ఆప్- బీజేపీ మధ్య నెక్ టు నెక్ పోటీ సాగుతుంది అని స్పష్టంగా తెలుస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.