తెలంగాణ కాంగ్రెస్‌ రివర్స్‌ జర్నీ

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అన్ని పార్టీలు కూడా తమ వద్ద ఉన్న అస్త్ర శస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. కేంద్రంలో బీజేపీ నిన్న మొన్నటి వరకు మిత్రులను దూరం చేసుకుని ఒంటరి పోరాటం చేయాలనుకుంది. కాని పరిస్థితి తారుమారు అయ్యిందనే ఉద్దేశ్యంతో ఎన్నికలు ఇంకా సంవత్సరం ఉండగానే మిత్రుల కాళ్ల బేరంకు సిద్దం అయ్యింది. ఇక ఏపీలో తెలుగు దేశం, వైకాపా, జనసేన పార్టీలు ఎన్నికల్లో వచ్చే నెలలోనేనా అన్నట్లుగా యుద్ద ప్రాతిపధికన కార్యకర్తలతో సమావేశాలు, మీటింగ్‌లు ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీలు ఇంత హడావుడి చేస్తుంటే తెలంగాణ కాంగ్రెస్‌ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది.

గత ఎన్నికల్లో గౌరవ ప్రధమైన స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఈఎన్నికల్లో ఆ స్థానాలను కూడా దక్కించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆ పార్టీలో వర్గ పోరాటాలు మరియు ఆధిపత్య పోరాటాలు పీక్స్‌కు చేరాయి. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. దాన్ని ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్‌ పార్టీ వినియోగించుకోవడంలో విఫలం అయ్యింది. తెలంగాణలో కాంగ్రెస్‌ తప్ప మరే ప్రత్యామ్నాయం లేదు. అయినా కూడా కాంగ్రెస్‌ వారు అలసత్వంతో పెద్దగా ప్రభావం చూపడం లేదు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అందరిని కలుపుకు పోవడంలో విఫలం అవుతున్నాడు.