జగన్ కి బిగ్ షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్..     2018-07-05   03:28:35  IST  Bhanu C

ఆంధ్రప్రదేశ్ ని రెండు గా చీల్చిన కాంగ్రెస్ పరిస్థితి ఏపీలో కుక్కని చింపిన విస్తరి అయ్యింది..దిక్కు మొక్కు లేక అనాధ శవంలా ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చంద్రబాబు పుణ్యమా కేంద్రం పై విమర్సల మహత్యం పరంగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది..చద్రబాబు కేంద్రం జగన్ రాజకీయాల పుణ్యమా అని ఏపీలో కాంగ్రెస్ పుంజుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది..అందులో బాగంగానే కాంగ్రెస్ ని వీడిన సీనియర్ లీడర్స్ అందరిని ఇప్పుడు మళ్ళీ రాహుల్ కాల్ బాక్ చేస్తున్నారు ఏపీలో పార్టీని బలోపేత చేయండి నేను మీరు ఏమి చెప్పిన చేయడానికి సిద్దం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

అయితే…ఈ సీన్ లోకి సైలెంట్ గా చంద్రబాబు ఎంటర్ అయ్యారని టాక్ వినిపిస్తోంది..చంద్రబాబు కి ఎందుకు మధ్యలో అనుకుంటున్నారా ఏమి లేదండి మాటల మాంత్రికుడు కాంగ్రెస్ సీనియర్ నేత బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఉండవల్లి అంటే చంద్రబాబు కే కాదు ఎంతో మంది సీనియర్ నేతలకి చెమటలు పడుతాయి..పోలవరం విషయంలో ఉండవల్లి చంద్రబాబు ని ఎంతగా ఇబ్బంది పెట్టారో మనకి తెలిసిందే అయితే ఈ క్రమంలో ఉండవల్లి జగన్ తోడుగా ఉంటే ఎన్నికల సమయంలో పార్టీకి మరింత దెబ్బ అని గ్రహించిన బాబు ఉండవల్లి ని కాంగ్రెస్ లోకి తీసుకుంటే పార్టీకి ఎంతో బలం అని సన్నిహితుల ద్వారా కాంగ్రెస్ హై కమాండ్ కి చెప్పించారట..దాంతో కాంగ్రెస్ ఇప్పుడు ఉండవల్లి చేరికపై ఎక్కువగా శ్రద్ద చూపుతోందని తెలుస్తోంది.