కత్తి మహేష్ జైలుకు వెళ్లక తప్పదా?     2018-06-30   23:16:51  IST  Raghu V

సంవత్సరం ముందు వరకు కత్తి మహేష్‌ ఎవరికి తెలియదు. కాని బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఒక్కసారిగా మీడియాలో స్టార్‌ అయ్యాడు. పవన్‌ను కత్తి మహేష్‌ విమర్శించడం, పవన్‌ ఫ్యాన్స్‌ ఆయనపైకి దాడికి ప్రయత్నించడం ఇలా అనేక కారణాల వల్ల కత్తి మహేష్‌ స్టార్‌ అయ్యాడు. కత్తి మహేష్‌ ఆ మద్య పవన్‌ ప్రతి కదలికను విమర్శిస్తూ వచ్చాడు. ఆ సమయంలో పవన్‌ స్వయంగా రంగంలోకి దిగి ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోవద్దంటూ సూచించడంతో పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ కత్తిపై సోషల్‌ దాడిని తగ్గించారు.

గత కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న కత్తి మహేష్‌ మళ్లీ మీడియాలో ప్రధానంగా కనిపిస్తున్నాడు. ఇటీవల ఒక టీవీ ఛానెల్‌ చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. హిందువులు పవిత్రంగా భావించే రాముడి గురించి అనాలోచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, హిందూ ధర్మంపై నమ్మకం కోల్పోయేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. రాముడు మంచి వాడు కాదన్న రీతిలో కత్తి మహేష్‌ వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాముడు ఎంత ఆదర్శనీయుడో, అంత దగుల్బాజీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాంతో పాటు సీత కూడా చివరి వరకు రాముడితో ఉంటే ఆమెకు న్యాయం జరిగేది
అన్నాడు.