‘మహానటి’ గురించి సామాన్యుడి మాట  

మహానటి గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకుంటున్నారు. అయితే ఒక సాదారణ వ్యక్తి తన సోషల్‌ మీడియా పేజీలో మహానటి గురించి ఇలా రాసుకున్నాడు. నేను ఒక సాదారణ సినిమా ప్రేక్షకుడిని, సినిమా ట్రైలర్‌ చూసి, టీజర్‌ చూసి బాగుంటుందనిపిస్తే వెళ్తాను, ప్రయోగాలు, ఫ్లాప్‌ సినిమాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపించను. వందల రూపాయలు పెట్టి సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమా పూర్తి తృప్తినివ్వాలనే ఉద్దేశ్యంతో తాను సినిమాకు వెళ్తాను. ఒక సినిమాకు వెళ్లాలని అనుకున్నప్పుడు ఆ సినిమా స్టార్‌ కాస్టింగ్‌, డైరెక్టర్‌ ఇలా అన్ని విషయాలను బేరీజు వేసుకుని వెళ్తాను. కాని మహానటి చిత్రం అనగానే అవన్ని నాకు ఆలోచనకు రాలేదు. ఆమె గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతతో సినిమా టాక్‌తో కూడా సంబంధం లేకుండా ముందే టికెట్లు బుక్‌ చేశాను.

నేను ఊహించిన దానికంటే దర్శకుడు అద్బుతంగా తెరకెక్కించాడు. ఇంత కాలంగా నాలో సావిత్రి గారి గురించి ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లభించాయి. ఆమె జీవితం ఎంతో మందికి ఆదర్శం అవ్వాలి. ఇలాంటి వారి గురించి తెలుసుకోవడం అందరికి మంచిది. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన సావిత్రి గారికి అసలైన నివాలిగా దర్శకుడు సినిమాను తెరకెక్కించాడు. సావిత్రి గారిని చూస్తున్నట్లుగానే అనిపించేలా కీర్తి సురేష్‌ కనిపించారు అంటే దర్శకుడు ఎంతగా వర్కౌట్‌ చేశాడో చెప్పుకోవచ్చు. ఇలాంటి అద్బుతమైన సినిమాలు తెలుగు సినిమాకు అవసరం అంటూ పోస్ట్‌ చేశాడు. ఎంతో మంది మహానటి గురించి ఇదే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.