‘మహానటి’ గురించి సామాన్యుడి మాట     2018-05-10   02:01:49  IST  Raghu V

తెలుగు సినిమా పరిశ్రమకు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన సావిత్రి జీవిత చరిత్రను తెరకెక్కించబోతున్నారు అనగానే అందరిలో ఆసక్తి కలిగింది. ఇతర హీరోయిన్స్‌తో పోల్చితే ఆమె వంద శాతం విభిన్నమైన వ్యక్తి. ఆమె స్టార్‌ అవ్వడం, వివాహం, మద్యానికి బానిసవ్వడం, మరణం ఇలా అన్ని కూడా సినిమాటిక్‌గానే జరిగాయి. అందుకే ఆమె జీవిత చరిత్ర సినిమా తీయాలని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ గట్టిగా కోరుకున్నాడు. ఆయన అనుకున్నట్లుగానే మహానటిని తెరకెక్కించాడు. అందరు భావించినట్లుగానే సావిత్రి జీవిత చరిత్రను దర్శకుడు పు ఆసక్తికర అంశాలతో తెరకెక్కించాడు. ఊహించని విధంగా సావిత్రి జీవిత కథకు అద్బుతంగా తెర రూపం ఇచ్చాడు.

తాజాగా విడుదలైన మహానటికి వెబ్‌ మీడియా వారు అంతా కూడా భారీ రేటింగ్‌లు ఇస్తున్నారు. ఇప్పటి వరకు బాహుబలి సినిమాకు అత్యధిక సరాసరి రేటింగ్‌ వచ్చింది. అయితే మహానటికి అంతకు మించిన రేటింగ్స్‌ వచ్చాయి. వెబ్‌ మీడియా నీరాజనాు పలుకుతున్న మహానటి చిత్రంపై సాదారణ ప్రేక్షకులు మరియు సగటు సినిమా అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక మంచి చరిత్రను చూసినట్లుగా అనిపిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రను కళ్ల ముందు పెట్టినందుకు కృతజ్ఞతలు అంటూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు సందేశాలు పంపుతున్నారు.