విదేశీ టెక్నాలజీ తో చోరీలు..హాలీవుడ్ రేంజ్ లో..విదేశీ మహిళ చోరీలలో దిట్ట  

పర్యటన పేరుతో భారత్ వచ్చిన ఓ విదేశీ మహిళ ధనికుల ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని హాలీవుడ్ రేంజ్ లో చోరీలు చేస్తోంది ఆమె చోరీలకి పోలీసులకి మైండ్ బ్లాక్ అయ్యింది అంటే విన్న వాళ్ళం మనకి ఎలా ఉంటుంది చెప్పండి సరే అసలు విషయంలోకి వెళ్తే..విదేశాల నుంచీ భారత్ వచ్చిన విదేశీ మహిళ బెంగుళూరులో దిగింది ఆర్ధికంగా స్థిరంగా ఉన్న నగరం కాబట్టి ఇక్కడ చోరీలకి పాల్పడితే గట్టిగా ముడుతుంది అనుకుందేమో హాలీవుడ్ రేంజ్ లో చోరీలకి పాల్పడింది..అంతేకాదు ఆమెకి సహకారంగా మరో ముగ్గురు విదేశీయులు కూడా ఉన్నారు అయితే ఆమె ఎలా పోలీసులకి దొరికింది అంటే..

కొలంబియాకి చెందిన ఓ మహిళ చాలాకాలం క్రితం టూరిజం వీసాపై భారత్‌కు వచ్చింది…పర్యతనలు చేస్తూ బెంగుళూరు కి చేరుకుంది.అక్కడ అందరూ బడాబాబులే దాంతో ఆ మహిళా నలుగురితో కలసి ముఠాగా ఏర్పడి ఎవరికీ అనుమానం రాని రీతిలో హైటెక్‌ పద్ధతుల్లో చోరీలు చేయడం మొదలు పెట్టింది..ముందుగా వారు ఎదో ఒక ఇంటిని ఎంచుకుంటారు ఎంతో ఖరీదైన కారులో అక్కడికి వెళ్లి రెండు సార్లు కాలింగ్ బెల్ నొక్కుతారు..ఎవరన్నా వస్తే అడ్రస్ అడిగి వెళ్ళిపోతారు ఎవరూ లేకపోతే సదరు మహిళా అప్పటికే రెడీ గా ఉన్న తన ముఠా సభ్యులకి వాకీ టాకీల్లో సమచాచారం ఇస్తుంది..

దాంతో వారు వచ్చి తలుపులు వారి టెక్నాలజీ తో ఎవ్వరికీ అనుమానం రాకుండా తలుపులు తీస్తారు అందిన కాడికి పుచ్చుకుని భారీగా దోచుకుని వెళ్ళిపోతారు..అయితే ఈ క్రమంలో ఎవరు దొంగతనాలు చేస్తున్నారో తెలియక సతమతమవుతున్న పోలీసులకి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్‌ ముఖర్జీ ఇంట్లో చోరీ ఒక ఆధారాన్ని ఇచ్చింది ఒక చిన్న స్క్రూ డ్రైవర్‌ పోలీసులకి దొరికింది..అయితే ఈ రకమైన స్క్రూ డ్రైవర్‌ కేవలం విదేశాలలో మాత్రమే దొరుకుతుంది దాంతో పోలీసులు ఆకోణంలో దర్యాప్తు చేపట్టారు..

గత నెల 22న ఓ దుస్తుల వ్యాపారి ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆ విదేశీ ముఠా బన్నేరుఘట్టలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు పసిగట్టి శుక్రవారం దాడి చేశారు. దొంగలు పారిపోవడానికి యత్నించగా పోలీసులు నిందితులపై పెప్పర్‌ స్ప్రే చల్లి పట్టుకున్నారు. విచారణలో వారు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మరిన్ని వివరాలు రాబడుతున్నారు..