కాఫీ పొడితో పేస్ మాస్క్ లు ఎలా వేసుకోవాలో తెలుసా?    2018-04-28   23:27:53  IST  Lakshmi P

చాలా మంది ఉదయం లేవగానే కాఫీ పడందే మంచం దిగరు. అలాగే కాఫీ త్రాగనిదే ఏ పని చేయాలని అనిపించదు. అలాంటి కాఫీతో ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? కాఫీలో ఉండే కెఫీన్ డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, స్కిన్ ట్యాన్ వంటి వాటిని తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. పేస్ మాస్క్ లు ఎలా వేసుకోవాలో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ కాఫీ పొడిలో ఒక స్పూన్ కలబంద జ్యుస్ ని కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖహ్మ్ మీద పేరుకుపోయిన దుమ్ము,ధూళి తొలగిపోతాయి.

ఒక బౌల్ లో ఒక స్పూన్ పంచదార,ఒక స్పూన్ పంచదార,రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ముఖంపై సర్క్యూలర్ మోషన్ లో స్క్రబ్ చేయాలి. ఈ విధంగా చేయటం వలన చర్మంపై మృత కణాలు తొలగిపోతాయి. దాంతో ముఖం కాంతివంతంగా మారుతుంది.