ఎన్నారైల కోసం 50 కోట్లు...     2018-04-30   05:05:44  IST  Bhanu C

మనవాళ్ళు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా సరే వారి సంక్షేమం కోసం కృషిచేస్తాం..వారికోసం ఏం చేయడానికైనా సిద్దమే అన్నారు కేసీఆర్..వివిధ దేశాలకి చెందిన ఎన్నారై ప్రతినిధులతో చర్చించిన కేసీఆర్ వారి సంక్షేమం కోసం 50 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించారు..అంతేకాదు లంగాణ ఎన్నారైలకు సాయం చేసేందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఓ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఎన్నారై సెల్‌తోపాటు దానికి అనుబంధంగా కమిటీ ఏర్పాటు, అది పనిచేసే విధానంపై కార్యాచరణ రూపొందించే బాధ్యతలను మంత్రి కేటీఆర్‌, ఎంపీ కవితకు అప్పగించారు.. ఎన్నారైల సమన్వయకర్త మహేష్‌ బిగాల తదితరులు పాల్గొన్నారు. ఎన్నారైల సంక్షేమానికి బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించామని, అందులో 50 కోట్లను ప్రత్యేక సెల్‌కు బదిలీ చేస్తామని సీఎం చెప్పారు. అవసరమైతే మరిన్ని నిధులివ్వడానికీ సిద్ధంగా ఉన్నామన్నారు.