CM Kcr Brother Daughter Ramya to Join BJP

ఈ హెడ్డింగ్ చూస్తే ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌వుతాం…కేసీఆర్ కుమార్తె ఏంటీ బీజేపీలోకి వెళ్ల‌డం ఏంట‌ని మ‌న మైండ్ బ్లాక్ అయిపోతుంది. కేసీఆర్ కుమార్తె క‌విత నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. మ‌రి ఆమె బీజేపీలోకి వెళ్ల‌డం ఏంట‌ని షాక్ అవుతాం… అయితే కేసీఆర్ కుమార్తె అంటే క‌విత కాదు…ర‌మ్య‌. మ‌రి ఆ స్టోరీ ఏంటో చూద్దాం.

తెలంగాణ‌లో రాజ‌కీయంగా ప‌ట్టు సాధించేందుకు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను గ‌ద్దె దించేందుకు క‌మ‌ల‌నాథులు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మూడురోజుల పాటు తెలంగాణలో పర్యటించారు. కేసీఆర్‌పై ఆయ‌న ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణ‌కు తాము ఎన్నో కోట్ల నిధులు ఇచ్చామ‌ని చెప్పుకొచ్చారు. అయితే వీటన్నింటికి కేసీఆర్ ఓ ప్రెస్‌మీట్ పెట్టి షాను ఏకేశార‌నుకోండి.

ఇక అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో ఇత‌ర పార్టీల్లోని పేరున్న సీనియ‌ర్ నేత‌ల‌ను బీజేపీలో చేర్చుకునేందుకు పెద్ద స్కెచ్ గీశారు. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి అసంతృప్త నేతలను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్ర‌మంలోనే టీ కాంగ్రెస్ సీనియ‌ర్లు అయిన మాజీ మంత్రులు డీకే.అరుణ‌, ముఖేష్‌గౌడ్‌, దానం నాగేంద‌ర్ లాంటి వాళ్ల‌ను పార్టీలో చేర్చుకునేందుకు వాళ్ల‌కు కొన్ని ఆఫ‌ర్లు కూడా ఇచ్చింద‌ట‌. ఇక కేసీఆర్ అన్న కుమార్తె అయిన ర‌మ్య విష‌యం కూడా బీజేపీ దృష్టికి వ‌చ్చింద‌ట‌.

ఇటీవ‌ల ర‌మ్య కేసీఆర్‌తో పాటు ఆయ‌న ఫ్యామిలీని టార్గెట్‌గా చేసుకుని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ఇక రాజీకంగా కూడా కేసీఆర్‌ తీరుపై విమర్శలు గుప్పించేందుకు రమ్యను బీజేపీలోకి చేర్చుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం రమ్య టీ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఇక కేసీఆర్ మ‌రో మేన‌ల్లుడు ఉమేష్‌రావు కూడా కాంగ్రెస్‌లో కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే.