మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌?     2018-06-17   23:15:48  IST  Bhanu C

తెలంగాణ సీఎం కేసీఆర్‌ గత కొన్నాళ్లుగా థర్డ్‌ ఫ్రంట్‌ అంటూ ఉరుకులు పరుగులు పెట్టిన విషయం తెల్సిందే. పలు రాష్ట్రాలకు వెళ్లి మూడవ కూటమికి సంబంధించిన చర్చలు జరపడం జరిగింది. కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయ కూటమి వచ్చి తీరాలి అంటూ గట్టి ప్రయత్నాలు చేసిన కేసీఆర్‌పై కాంగ్రెస్‌ నాయకులు మొదటి నుండి విమర్శలు చేస్తూనే ఉన్నారు. కేసీఆర్‌ మూడవ కూటమి బీజేపీకి అనుకూలం అంటూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్‌ నాయకులు అన్నట్లుగానే కేసీఆర్‌ మూడవ కూటమి బీజేపీ అధినాయకత్వంకు అనుకూం అయ్యి ఉంటుందనే అనుమానాలు ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతున్నాయి.

ఒక వైపు ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంపై యుద్దం ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్‌ మాత్రం ప్రధాని మోడీతో భేటీల మీద భేటీలు అవుతున్నారు. రహస్య భేటీలు మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం భేటీలు అంటూ మోడీతో కేసీఆర్‌ భేటీ అవ్వడం చర్చనీయాంశం అవుతుంది. తృతీయ ఫ్రంట్‌ అంటూ కేసీఆర్‌ ప్రకటించిన తర్వాత మోడీతో భేటీ అవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే అంతా అనుకున్నట్లు ఏమీ లేదు. సహజంగా అయితే తమకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నందుకు కేసీఆర్‌పై మోడీ సీరియస్‌గా ఉండటంతో పాటు, ఖచ్చితంగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం కుదరదు అని చెప్పిస్తాడు. కాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంతో పాటు, కేసీఆర్‌తో రహస్యంగా కూడా మోడీ మాట్లాడారు.