“వారెవ్వా బాబు”.. గారు రమణ దీక్షితులకి “చెక్” ఇలా పెట్టారా.  

హిందువుల మనోభావాలు దెబ్బకొట్టి తద్వారా చంద్రబాబు ఓటు బ్యాంకుని కొల్లగొట్టాలనే వ్యూహంలో భాగంగా..తెరపైకి అనూహ్యంగా తిరుమల తిరుపతి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులని తీసుకు వచ్చారు..తిరుమలలో అపచారం జరుగుతోంది ఆగమన శాస్త్ర విరుద్దంగా ఉంది అక్కడ తొవ్వేశారు ఇక్కడ ఎదో చేశారు అంటూ దీక్షితులు గారు మీడియా కి ఎక్కి ఏకంగా స్వామీ ఆభరణాలు పై చంద్రబాబు ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు..ఆరోపణలు చేశారు..అయితే ఈ క్రమంలోనే జగన్ ని కలవడం…ఈ అన్ని పరిణామాలు అందరికీ తెలిసినవే

అయితే ఎపీలోనే కాదు ఏడుకొండలవాడిని కొలిచే వారు ఈ ఆరోపణలకి చలించిపోయారు నమ్మే వాళ్ళు నమ్మేశారు తిట్టే వాళ్ళు తిట్టేసుకున్నారు..ఇలా ఎన్నో ఎన్నో అనర్ధాలు జరిగిపోయాయి అయితే ఈ క్రమంలోనే జగన్ వ్యూహాత్మకంగా బాబు ని ఇరకాటంలో పెట్టి బాబు ని హిందువుల ఒట్లకి దూరం చేయాలనీ ఈ వివాదాన్ని మరింత సాగాతీయాలని అనుకుంటున్నా తరుణంలో బాబు దీక్షితుల నోటికి కట్టడి వేశారు మరో మారు దీక్షితులు నోరు మెదపకుండా దీక్షితులుపై బ్రహ్మాస్తం వేశారు..ఇంతకీ బాబు ఏమి చేశారంటే

పదవీ విరమణ చేసిన ఒక ఐపీఎస్ అధికారి అయిన రమణ కుమార్ ని సమాచార హక్కు చట్టం భాద్యతలు అప్పగించారు అయితే దీంట్లో దీక్షితులకి చెక్ పెట్టింది ఏముందనే కదా..ఇంతకీ ఈ ఐపీఎస్ అధికారి ఎవరో కాదు..గతంలో ఆయన టీటీడీ విజిలెన్స్ అధికారిగా పనిచేశారు..దీక్షితులు గారు అక్కడ ఉన్నప్పుడు ఆయన గురించి ఆణువణువూ తెలిసిన వక్తి కూడా..ఆయన ఎలాంటి వ్యవహారాలూ వెలగబెట్టారో ఆయనకీ బాగా తెలుసు. అప్పట్లో ఆయన దీక్షితులని నిలువరించే పరిస్థితి లేదు దాంతో సరైన సమయం కోసం వేచి చూశారు.

అయితే చంద్రబాబు పై ‘రమణదీక్షితులు’ చేసిన విమర్శలపై, ఆరోపణలపై ‘రమణకుమార్‌’ స్పందించారు. అసలు విషయాలు బయటకి చెప్తూ ఎదురు దాడి మొదలు పెట్టారు…రమణదీక్షితుల ఆస్తులు, ఆయన వ్యవహారశైలి ఆయన సాంప్రదాయాలకి విరుద్దంగా ఏమి ఏమి చేశారో రమణ కుమార్ కి ఆణువణువూ తెలుసు అప్పట్లో శ్రీవారి నగల పరిస్థితి ఎలా ఉందో అన్ని వివరాలను బాహాటంగా మీడియాకు తెలిపారు…టీడీపీ ప్రభుత్వంపై చంద్రబాబు పై దీక్షితులు చేస్తున్న ఆరోపణలని తిప్పికొట్టారు..అంతేకాదు రమణ కుమార్ ఉన్నంత వరకూ దీక్షితులు నోరు మెదపరని ఒక వేళ దీక్షితులు మాట్లాడితే అప్పుడు అన్ని నిజాలు రమణ కుమార్ మాట్లాడుతారని అంటున్నారు టీడీపీ నేతలు మొత్తానికి దీక్షితులు ఎపిసోడ్ క్లోజ్ అయ్యినట్టే అంటున్నారు టీడీపీ నేతలు.