CM Chandrababu Naidu Facing Problems From 4 Ministers

ఏపీలో అధికార టీడీపీలో ఇటీవ‌ల క్ర‌మ‌శిక్ష‌ణ పూర్తిగా గాడి త‌ప్పేస్తోంది. ఒక‌ప్పుడు క్ర‌మ‌శిక్ష‌ణ‌కు కేరాఫ్ అంటే టీడీపీ. చంద్ర‌బాబు ఏపీలో రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన ఈ మూడేళ్లలో క్ర‌మ‌శిక్ష‌ణ పూర్తిగా గాడి త‌ప్పేసింది. బాబు మాట‌ను ఎవ్వ‌రూ లెక్క‌చేయ‌డం లేదు. కొన్ని పంచాయితీల విష‌యంలో బాబు నాయ‌కుల‌కు, మంత్రుల‌కు ప‌దే ప‌దే వార్నింగ్‌లు ఇస్తున్నా బాబు మాట‌ను మాత్రం వారు భేఖాతార్ చేస్తున్నారు.

ముఖ్యంగా త‌న కేబినెట్ స‌హ‌చ‌రుల్లో న‌లుగురు మంత్రుల విష‌యంలో మాత్రం బాబుకు పెద్ద త‌ల‌నొప్పులే వ‌స్తున్నాయి. ఉత్త‌రాంధ్ర‌లోని విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాస‌రావు వ‌ర్సెస్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు మ‌ధ్య జ‌రుగుతోన్న వార్ చంద్ర‌బాబుకు పెద్ద సంక్లిష్టంగా మారింది. చంద్ర‌బాబు వీరికి ఎన్నిసార్లు వార్నింగ్‌లు ఇచ్చినా వారు మాత్రం ఒక‌రిమీద ఒక‌రు బాబుకు ప‌దే ప‌దే ఫిర్యాదులు చేసుకుంటూ వ‌స్తున్నారు.