CM Chandrababu Gives A Big Shock to 2 TDP Mp’s and Mla

తెలుగు రాజ‌కీయాల్లో టీడీపీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు పెట్టింది పేరు. అలాంటి టీడీపీ ఏపీలో 2014లో అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి క్ర‌మ‌శిక్ష‌ణ చాలా గాడి త‌ప్పేసింది. గ‌తంలో ఎన్టీఆర్‌, ఆ త‌ర్వాత చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు టీడీపీలో ఉన్న క్ర‌మ‌శిక్ష‌ణ ఇప్పుడు మ‌చ్చుకైనా క‌న‌ప‌డ‌డం లేదు. ఎవ‌రికి వారు ఇష్ట‌మొచ్చిన‌ట్టు ఓపెన్‌గానే పార్టీ అధినేత‌తో పాటు పార్టీపైనా అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ పార్టీకి తీర‌ని న‌ష్టం క‌లిగిస్తున్నారు.

ఇటీవ‌ల మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న త‌ర్వాత నివురుగ‌ప్పిన నిప్పుల్లా ఉన్న అసంతృప్తి ఒక్క‌సారిగా భ‌గ్గుమంది. మంత్రి ప‌ద‌వి రాని వాళ్లు, మంత్రి ప‌ద‌వి నుంచి ఊస్టింగ్ అయిన వాళ్లు ఇష్టారాజ్యంగా చంద్ర‌బాబును, పార్టీ అధిష్టానాన్ని తిట్టేశారు. కొంద‌రైతే ప‌ద‌వులకు రాజీనామాలు కూడా చేసి బెదిరించారు. ఇక తాజాగా చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్ ఓపెన్‌గానే చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ మాట్లాడ‌డంతో చంద్ర‌బాబు సైతం పార్టీలో ప్ర‌క్షాళ‌న‌కు రెడీ అయ్యారు.