మృగంగా మారిన మత బోధకుడు!!     2015-02-05   02:53:44  IST  Raghu V

ClergyMan Raped a Minor Girl

కలకత్తా వేదికగా జరిగిన ఒక ఘోరం తాజాగా వెలుగులోకి వచ్చింది..మతాన్ని బోధిస్తూ..మంచి చెప్పాల్సిన ఒక బోధకుడు మృగంగా మారి ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు..వివరాల్ళోకి వెళితే..పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ మతబోధకుడు కిరాతక చర్యకు ఒడిగట్టాడు. హుగ్లీలోని పునరావాస కేంద్రంలో 16 ఏళ్ల అమ్మాయిపై మత బోధకుడు అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది. గురప్ భస్తరా క్రిస్టియన్ హోమ్‌కు చెందిన మతబోధకుడు మైనర్ బాలికపై నెల రోజులుగా చిత్రహింసలకు గురి చేస్తూ, ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ ఎన్జీవో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే ఏడాది కాలంగా ఈ చిత్ర హింసలు సాగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక ఆ దుర్మార్గుడిని పోలీసులు అరెస్ట్ చేసి అతనిపై చిత్రహింసలు, అత్యాచారం కింద కేసులు పెట్టారు. మరో పక్క బాధితురాలిని అదే జిల్లాలో ప్రభుత్వం నడిపే హోమ్‌కు తరలించారు. ఇక దీనిపై మహిళా సంఘాలు యధావిధిగా రోడ్డెక్కి కేకలు పెట్టాయి.