ఈ నందమూరి హీరోలకు ఏమైంది..? బాబాయ్ అబ్బాయ్ లకు చెడిందా ..?  

నిన్నటి తరం హీరోల్లో తనకు నచ్చిన లక్షణాలు గురిచి చెబుతూ చిరంజీవి, నాగార్జు, వెంకటేష్ ల గురిచి ప్రస్తావించాడు గానీ.. సొంత బాబాయ్ బాలయ్య పేరు ఎక్కడా చెప్పకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అంతే కాదు ఎన్టీఆర్ బయోపిక్ విషయం కూడా తనకు పెద్దగా తెలియదని ముఖం చాటేసాడు. తేజ దర్శకుడిగా ఉన్నప్పుడు ఓ పాత్ర కోసం అడిగారని తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదని చెప్పాడు కళ్యాణ్ రామ్ చెప్పాడు. అంతేకాకుండా బాబాయ్ అబ్బాయ్ ల మధ గ్యాప్ రావడానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యనే టీడీపీ కి మా ఇద్దరు అబ్బాయిలు నేను ప్రచారం చేయబోమని నందమూరి హరికృష్ణ చెప్పడం ఇక్కడ కొసమెరుపు. మొత్తానికి నందమూరి కుటుంబంలో చిచ్చు రేగింది అన్నది వాస్తవం .