ఈ నందమూరి హీరోలకు ఏమైంది..? బాబాయ్ అబ్బాయ్ లకు చెడిందా ..?     2018-06-11   06:23:03  IST  Bhanu C

బాబాయ్ – అబ్బాయ్, అబ్బాయ్ – బాబాయ్ అంటూ ఆప్యాయపు పిలుపులు ఇప్పుడు ఆ కుటుంబంలో కనిపించడం లేదు. ఎడమొఖం పెడమొఖం అన్నట్టుగానే వారు ఉంటున్నారు. గతంలో ఉన్న ఆ అనుబంధం మాటల్లో కూడా కనిపించడం లేదు. ఆ కుటుంబమే నందమూరి కుటుంబం. నందమూరి హీరోలైన బాలయ్య , కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ఒకరకమైన అనుబంధం కనిపించేది. కానీ ఆ ఇద్దరు యువ హీరోలు బాబాయ్ బాలయ్యను పక్కకు పెట్టేసినట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు కళ్యాణ్ రామ్ – జూనియర్ ఎన్టీఆర్ దూరం దూరంగా ఉన్నట్టు కనిపించేవారు. కానీ ఇప్పుడు వారిద్దరూ బాగా క్లోజ్ అయిపోయి బాబాయ్ బాలయ్య కు దూరం అయ్యారు.

ఇద్దరు ఇప్పుడు సొంత అన్నదమ్ములా మెలుగుతున్నారు. తారక్ లేనిదే కళ్యాణ్ రామ్ సినిమా ఆడియో ఫంక్షన్లు జరగవు. అన్నయ్య-తమ్ముడు అంటూ ఆప్యాయంగా మెలుగుతున్నారు. అది చూసిన బాలయ్యకు ఎక్కడో కాలింది. అప్పటి నుంచి బాలయ్య కళ్యాణ్ రామ్ ను పక్కనబెట్టేసాడు. ఇది జరిగి చాలా కాలమవుతోంది. అయితే తాజాగా జరిగిన కళ్యాణ్ రామ్ ఇంటర్వ్యూలో ఇదంతా నిజమేనని మరోసారి ఆయన మాటల్లోనే చెప్పేసాడు.