అతడిపై చిరు, పవన్‌లు ఫోకస్‌     2018-06-08   22:09:02  IST  Raghu V

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ కెరీర్‌ ఆశించిన స్థాయిలో లేదని చెప్పక తప్పదు. మెగా ఫ్యాన్స్‌ ఈయనపై చాలా నమ్మకం పెట్టుకుని సుప్రీం హీరో అంటూ పిలిచేసుకుంటున్నారు. కాని తేజ్‌ మాత్రం రెండు సంవత్సరాలుగా సక్సెస్‌ కోసం మొహం వాచేలా ఎదురు చూస్తున్నాడు. ఈయన చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్‌ ముందు బొక్కబోర్లా పడుతూ వస్తుంది. అయినా నిరుత్సాహపడకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా కూడా ఈయన ‘తేజ్‌’ చిత్రాన్ని చేస్తున్నాడు. అంతకు ముందు ఇంటిలిజెంట్‌ చిత్రాన్ని చేశాడు. విన్నర్‌, జవాన్‌ ఇలా అన్ని కూడా బ్లాక్‌ బస్టర్‌ ఫ్లాప్‌ుగా మిగిలి పోయాయి. దాంతో మెగాస్టార్‌ చిరంజీవి మరియు పవన్‌ కళ్యాణ్‌లు మేనల్లుడి కెరీర్‌పై ఫోకస్‌ పెట్టారు.

సోదరి కొడుకు కెరీర్‌ను నిబెట్టలేక పోతే ఇంత క్రేజ్‌ ఉండి ఎందుకు అనుకున్నారో ఏమో కాని ఇద్దరు కూడా తమకు తోచిన సాయంను చేసేందుకు ముందుకు వచ్చారు. చిరంజీవి స్వయంగా అల్లు అరవింద్‌తో మాట్లాడి తేజ్‌ కోసం ఒక చిత్రం చేయాల్సిందిగా కోరాడట. అల్లు అరవింద్‌ బ్యానర్‌లో సినిమా అంటే మినిమం సక్సెస్‌ గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తేజ్‌ కోసం ఒక యువ దర్శకుడితో కథను సిద్దం చేయిస్తున్నాడు. తేజ్‌ పూర్తి అయిన తర్వాత అల్లు అరవింద్‌ బ్యానర్‌లో సినిమా ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది. గీతాఆర్ట్స్‌లో సినిమా చేసే అవకాశం రావడం యంగ్‌ హీరోలకు పెద్ద లక్కీ ఛాన్స్‌గా చెప్పుకుంటారు.