చిన్నల్లుడు మహా స్పీడ్‌గా ఉన్నాడు.. మరి ఇదెందుకు ఆలస్యం?    2018-05-17   06:52:19  IST 

మెగాస్టార్‌ ఫ్యామిలీ నుండి ఎంత మంది హీరోలు ఉన్నారు అంటే ఠక్కున సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే లెక్కకు వెంటనే అందనంత మంది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నారు. చిన్న పెద్ద మెగా హీరోలందరిని కలుపుకుంటే దాదాపు డజనుకు అటు ఇటుగా ఉంటారు. ఇంకా కూడా మెగా ఫ్యామిలీ సభ్యులు ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు సిద్దం అవుతున్నారు. ఇక చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ ఇటీవలే ఒక సినిమాను ప్రారంభించాడు. హీరో అవ్వాలనే కోరికతోనే ఈయన చిరంజీవి ఇంటి అల్లుడు అయ్యాడు అంటూ ప్రచారం జరిగింది. అందరు అనుకున్నట్లుగానే కాస్త గ్యాప్‌ తీసుకుని కళ్యాణ్‌ హీరోగా తెరంగేట్రం చేశాడు.

మెగా వ్యూహమో మరేంటో కాని భారీ చిత్రంగా కాకుండా ఒక చిన్న చిత్రంగా కళ్యాణ్‌ మొదటి సినిమా తెరకెక్కింది. రాకేశ్‌ శశిక దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇటీవలే ఈ సినిమాను పూర్తి చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు డబ్బింగ్‌ కార్యక్రమాలు కూడా మొదు అయ్యాయి. అతి త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తామంటూ నిర్మాత సాయి కొర్రపాటి ప్రకటించాడు. అంతా బాగానే ఉంది కాని ఒక్క విషయంలో ప్రేక్షకుల మరియు మెగా ఫ్యాన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.