Chiranjeevi to join BJP?

ఏపీ బీజేపీలో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకోనుందా ? ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా మెగాస్టార్ చిరంజీవి ఆ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధ‌మైందా ? అంటే అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఏపీలో కాపు ఉద్య‌మం బ‌లంగా న‌డుస్తోంది. కాపుల‌ను బీసీల్లో చేర్చాల‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం త‌ల‌కెత్తుకోన్న ఉద్య‌మం ఎఫెక్ట్‌తో ఇక్క‌డ కాపులు రాజ‌కీయంగా కీల‌క ప్యాక్ట‌ర్‌గా మారారు.

ఈ క్ర‌మంలోనే కాపుల‌ను త‌మ వైపున‌కు తిప్పుకునే ప్లాన్‌లో ఉన్న బీజేపీ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా అదే సామాజిక వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్సీ కాపు వీర్రాజును నియ‌మించ‌నుంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఏపీ నుంచి కేంద్రంలో వెంక‌య్య‌నాయుడు చ‌క్రం తిప్పుతుండ‌డం, చంద్ర‌బాబుకు అండ‌గా ఉండ‌డంతో బీజేపీ.. టీడీపీల మ‌ధ్య స‌ఖ్య‌త కొన‌సాగింది. ఇప్పుడు ఏపీ బీజేపీ మొత్తం రాం మాధ‌వ్ కంట్రోల్‌లోకి వెళ్లిపోవ‌డంతో ఇప్పుడు ఏపీలోని కాపుల‌ను బీజేపీ వైపున‌కు మ‌ళ్లించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.