టీడీపీలోకి చిరు..? చంద్రబాబు తాజా స్కెచ్ ఇదే !     2018-06-22   01:02:33  IST  Bhanu C

గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని అడ్డంపెట్టుకుని..ఆయన సహకారంతో ఏదోలా అధికారం దక్కించుకుంది టీడీపీ. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ మిత్రుడు కాస్తా శత్రువు అయ్యాడు. పోనీ తెలుగుదేశం పార్టీకి సొంతంగా ఎన్నికలను ఎదుర్కునే దమ్ము ఉందా అంటే అదీ లేదు. ఖచ్చితంగా ఎవరో ఒకరి సహాయం తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవిపై కన్నేసింది టీడీపీ. ఆయన సహకారంతో వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలని చూస్తోంది.

చిరు గనుక టీడీపీలోకి వస్తే… మంచి ప్రయారిటీ ఇస్తామని టీడీపీ కబురు పంపిందట. ఎలాగూ.. చిరంజీవి రాజ్యసభ సభ్యత్వ కాలం ఎలాగూ ముగియబోతోంది. ఈ సమయంలోనే రండి మిమ్మల్ని మళ్లీ రాజ్యసభకు పంపుతాం అని. తమ పార్టీలో చేరాలని…. చిరంజీవిని మళ్లీ రాజ్యసభకు నామినేట్ చేస్తామని తెలుగుదేశం పార్టీ ప్రతిపాదన పంపిందట.

అప్పటికే రాజకీయాల్లోకి వచ్చి అవకాశవాదిగా ముద్ర వేయించుకున్న చిరంజీవి…. మళ్లీ మరో పార్టీలోకి మారి విమర్శల పాలవ్వకూడదని అనుకున్నాడట. అందుకే రాజ్యసభ సభ్యత్వమూ వద్దు.. తెలుగుదేశం సభ్యత్వమూ వద్దని…. సినిమాలకే పరిమితం అవుతానని స్పష్టం చేశాడట.అయినా టీడీపీ పట్టువదలకుండా తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చూస్తున్నట్టుగానే వార్తలు వస్తున్నాయి.