జనసేనలోకి చిరంజీవి.. త్వరలోనే అధికారిక ప్రకటన    2018-07-11   03:50:13  IST  Bhanu C

పవన్‌ కళ్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీలో ఈమద్య భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. పలు పార్టీల నాయకులు మరియు పలు ప్రజా సంఘాల వారు జనసేనలో పవన్‌ ఆధ్వర్యంలో జాయిన్‌ అయ్యారు. ఇటీవలే చిరంజీవి అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి నాయుడు భారీ ఎత్తున అభిమానులతో మరియు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న వారితో జనసేనలో జాయిన్‌ అవ్వడం జరిగింది. చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీకి వెళ్లిన సమయంలో చిరంజీవితో పాటు పలువురు అభిమానులు కూడా ఆ పార్టీలోకి వెళ్లారు. తాజాగా అభిమానులు అంతా కూడా జనసేన పార్టీలో జాయిన్‌ అవుతున్నారు.

అభిమానుల దారిలోనే చిరంజీవి కూడా జనసేన పార్టీలో జాయిన్‌ అవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. గత కొంత కాలంగా చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నాడు. ఈయన్ను కాంగ్రెస్‌ నాయకులు పలు సార్లు సంప్రదించేందుకు, మాట్లాడేందుకు ప్రయత్నించినా కూడా చిరంజీవి మాత్రం సున్నితంగా తిరష్కరిస్తూ వచ్చాడు. తమ్ముడు జనసేన పార్టీ పెడితే అన్న కాంగ్రెస్‌లో ఉండటం ఏమాత్రం బాగుండదని మెగా ఫ్యాన్స్‌ మొదటి నుండి చెబుతూ వస్తున్నారు.

ఇటీవలే తన అన్న చిరంజీవి రాజకీయాల గురించి పవన్‌ మాట్లాడుతూ.. జనసేన అనేది మెగా అభిమానుల్లో ఒక్కరిది అని, జనసేన పార్టీ మెగా ఫ్యాన్స్‌కు సొంత పార్టీలా అంటూ చెప్పుకొచ్చాడు. జనసేన పార్టీ తరపున మెగా ఫ్యాన్స్‌ను రంగంలోకి దించాలని పవన్‌ భావిస్తున్నాడు. ఇక తన అన్న చిరంజీవి పూర్తిగా రాజకీయాకు దూరంగా ఉండాలని భావిస్తున్నాడు. ఇకపై సినిమాతోనే లైఫ్‌ను కొనసాగించాలని భావిస్తున్నాడు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు అంటూ చిరంజీవి గురించి పవన్‌ చెప్పుకొచ్చాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి త్వరలోనే జనసేన పార్టీలో అధికారికంగా జాయిన్‌ అవుతాడని, అయితే పార్టీ కార్యక్రమాల్లో మరియు ఎన్నికల్లో పాలుగొనక పోవచ్చున అని, పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా మాత్రమే ఉంటాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం పవన్‌కు మద్దతుగా ఉన్నారు అంటూ చెప్పేందుకు చిరంజీవి త్వరలోనే జనసేన సభ్యత్వం తీసుకుంటాడని తెలుస్తోంది. ఈ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో జనసేన క్రియాశీలకంగా వ్యవహరించబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.