చిరంజీవి సంచలన నిర్ణయం..రాజకీయాలకి సెలవు     2018-04-17   01:23:16  IST  Bhanu C

ఇప్పుడు ఈ వార్త అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ పెను సంచలనం సృష్టిస్తోంది..చిరంజీవికి రాజకీయాల మీద విరక్తి కలిగిందట ఇక రాజకీయాల్లో ఉండలేను అంటూ చిరు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది..ముందు నుంచీ సేవా కార్యక్రమాల పట్ల ఎంతో ఆకర్షితుడైన చిరంజీవి అందుకు తగ్గట్టుగానే ఎన్నో కార్యక్రమాలు చేసి చిరు సినిమా హీరో మాత్రమే కాదు రియల్ హీరో అని అనిపించుకున్నారు..అయితే

ప్రజలకి సేవచేయాలనే ఉద్దేశ్యంతో ప్రజారాజ్యం పార్టీ ని పెట్టిన చిరు అనతికాలంలోనే దానిని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. రాజకీయాలలో వచ్చే ఒడిదుడుకులు ఎంతో సున్నితమైన మనస్సు కలిగిన చిరు ఎదుర్కొనలేక పోయారు.. ఫలితంగా చిరు రాజకీయాలలోకి వచ్చే తీవ్రంగా నష్టపోయారు…అభిమానం వేరు. వాస్తవం వేరు అని కొంతకాలానికే తెలిసి వచ్చింది చిరు కి . పవన్ కల్యాణ్ ది దాదాపు అదే రూటు. కాకపోతే పవన్ ఊసరవెల్లి రంగులు మార్చినట్లు పార్టీలను తిట్టే విషయంలో రకరకాలుగా మారుస్తూ వస్తున్నారు. కాసేపు చంద్రబాబు పాలన భేష్ అంటాడు. మరికాసేపు అవినీతి పరుడుని ముద్రవేశాడు. ఫలితంగా గుడ్ విల్ దెబ్బతింది.