Cheliyaa Movie Review

చిత్రం : చెలియా

బ్యానర్ : మద్రాస్ టాకీస్

దర్శకత్వం : మణిరత్నం

నిర్మాతలు : మణిరత్నం

సంగీతం : ఏఅర్ రెహమాన్

విడుదల తేది : ఏప్రిల్ 7, 2017

నటీనటులు – కార్తి, అదితి రావు హైదరీ, ఆర్ జే బాలాజీ తదితరులు

లెజండరీ డైరెక్టర్ మణిరత్నం మునుపటి ఫామ్ లో లేరు. ఈమధ్య కాలంలో ఆయన సినిమాలేవి జనాల్ని ఆకట్టుకోలేదనే చెప్పాలి. అలాగే కార్తీ కూడా కాష్మోరాతో ఓ పరాజయాన్ని అందుకున్నాడు. ఇక బాలివుడ్ లో అవకాశాలు లేక కేరీర్ ని నత్తనడకన నెట్టుకొస్తున్న అదితీరావు హైదరీకి చెలియా ఓ గొప్ప అవకాశం. ఈ ముగ్గురు తమ డల్ ఫేజ్ నుంచి బయటపడ్టారా? చెలియా అద్యంతం ఎలా సాగిందో రివ్యూలో చూడండి.

కథలోకి వెళితే :

1999 కార్గిల్ యుద్ధవాతావరణంలో సినిమా మొదలవుతుంది. భారత ఏయిర్ ఫోర్స్ అధికారి వరుణ్ (కార్తీ) ఊహించని ఓ ప్రమాదం మూలాన పాకిస్తాన్ సైనికులకి దొరికిపోతాడు. అతడిని పాకిస్తాన్ జైలుకి తీసుకెళ్ళిన శత్రు సైనికులు చిత్రవధ చేస్తుంటారు. కాని వరుణ్ కి ఆ నొప్పి తెలియట్లేదు. తన గుండెని పిండేస్తున్న విషయం, తన ప్రేయసి లీలా అబ్రహాం (అదితి) తనకి దూరమవడం. ఆమె ఇప్పుడు ఎక్కడుందో తెలియదు, ఎక్కడో పాకిస్తాన్ జైలునుంచి తప్పించికోని మళ్ళీ తన లీలని చూడగలడో లేదో తెలియదు. తను కనబడినా, తనతో జీవితాన్ని పంచుకునేందుకు అంగీకరిస్తుందో లేదో కూడా తెలియదు. ఈ అగమ్యగోచర ప్రేమ జీవితానికి కారణం వరుణ్ ప్రవర్తన, తను చేసిన తప్పులే. ఆ కలహాలు ఏంటో, జైలులో బందీగా మారకముందు వరుణ్ తన లీలతో గడిపిన మధురక్షణాలు ఏంటో, వారిమధ్య కలహాలకి కారణాలేంటో, వరుణ్ – లీలా మళ్ళీ కలుసుకున్నారో లేదో తెర మీదే చూడాలి.