“మోడీ” కి చంద్రబాబు మార్క్ “స్కెచ్”..ముహూర్తం “మే 7”     2018-04-29   01:07:37  IST  Bhanu C

ఏపీ పై బీజేపి చేసిన దారుణమైన మోసాన్ని..ఎప్పటికప్పుడు ఎండగడుతూ తన ఎంపీలు, ఎమ్మెల్యేలు ద్వారా ఢిల్లీ లో ఎన్నడూ లేనతంగా నిరసనలు తెలిపి ప్రకంపనలు రేపిన చంద్రబాబు నాయుడు..మోడీ చేస్తున్న మోసాన్ని ఎండగట్టారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దీక్షకి ఎందుకు దిగారని అందరినీ ఆలోచింపచేసేలా చేశారు..దాంతో మోడీ నాలుగేళ్ళుగా కష్టపడి సంపాదించిన పేరు కాస్తా బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందనే చెప్పాలి..

అయితే చంద్రబాబు కేంద్రంపై ఎంతో ఒత్తిడి తీసుకురావాలని అనుకున్నా సరే మోడీ ఏపీ విషయంలో మాత్రం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో…చంద్రబాబు ఎంతో వ్యూహాత్మకంగా తన పుట్టిన రోజున దీక్ష చేశారు..అయితే ఈ దీక్ష ఎఫెక్ట్ మోడీ జీ కి గట్టిగానే తగిలింది..ఒక రాష్ట్ర సీఎం ఇంతలా దీక్షలు చేస్తున్నా సరే కేంద్రం ఉలుకు పలుకు లేకుండా ఉండటం సర్వాత్రా చర్చనీయంసం అయ్యింది.. అయితే పట్టు వదలని చంద్రబాబు మరో మారు ఏపీ తరుపున ఏపీ ప్రజల తరుపున తన నిరసన గళాన్ని వినిపిచడానికి మరో ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే..