టీడీపీ కి “పవన్” మేలు చేస్తే .. “సొంత నేతలు” కీడు చేస్తున్నారా ..?     2018-05-11   03:10:07  IST  Bhanu C

టీడీపీ నాయకుల్లో ఉన్న అంతర్గత లోపలను చక్కదిద్దే పనిలో పడ్డారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. అందుకే కొంచెం కఠినంగానే పార్టీ నాయకులతో వ్యవహరిస్తున్నారు. అలా ఉండకపోతే అదే అదునుగా భావించి ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తూ పార్టీని దెబ్బతీస్తారని బాబు ఆలోచన. అందుకే పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల అందరి మీద నిఘా పెట్టారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. నోటి దురద ఎక్కువగా ఉన్న నాయకుల తోకలు కట్ చేసే పనిలో బాబు ఉన్నారు.

ఎందుకంటే గతంలో ఈ నోటి దురద నాయకులను హెచ్చరించినా ఫలితం కనిపించకపోవడంతో బాబు వారిపై గట్టిగానే సీరియస్ అవుతున్నారు. ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నాడనే భావన ప్రజల్లో బలంగా ఉంది. ఇటువంటి దశలో సొంత పార్టీ నేతలే పెద్ద తలనొప్పిగా మారడంతో చంద్రబాబు నష్ట నివారణ చర్యలు ప్రారంభించాడు. పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేల అవినీతి తారాస్థాయికి చేరడంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.