ప‌థ‌కాల‌పై సంతృప్తి ఎవ‌రికి.. బాబుకా.. ప్ర‌జ‌ల‌కా..?     2018-06-11   03:39:41  IST  Bhanu C

అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు మాన‌స పుత్రిక జ‌న్మ‌భూమి క‌మిటీల‌పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకున్న విష‌యం కొత్త‌కాదు. ఏకంగా.. ఏరాష్ట్రంలోనూ లేని విధంగా చంద్ర‌బాబు త‌న ప్ర‌భుత్వంలో అవినీతి పెరిగిపోయింద‌ని గుర్తించి అధికారుల‌ను, సిబ్బందిని పైకి ఏమీ అన‌లేక అవినీతికి పాల్ప‌డిన వారిని ప‌ట్టించండ‌ని ప్ర‌జ‌లకే 1100 నెంబ‌రును అందించారు. పోనీ.. దీనికి పోన్ చేసినా.. స‌ద‌రు సిబ్బంది రికార్డు చేసుకుంటున్న కేసులు రోజుల త‌ర‌బ‌డి పెండింగ్‌లో ప‌డిపోతున్నాయి. నిజానికి రోగం రాకుండా చూడ‌డం పోయి.. రోగం వ‌చ్చాక మందు ఇస్తున్న‌ట్టు ఇలా అవినీతి గురించి అలెర్ట్ చేయ‌మ‌ని నెంబ‌ర్ ఇవ్వ‌డం ప్ర‌జ‌ల్లో విస్మ‌యం క‌లిగిస్తున్న విష‌యం. అదేవిధంగా ప్ర‌భుత్వం ఆస్ప‌త్రుల ప‌రిస్థితి మ‌రింత‌గా దిగ‌జారుతోంది.

రోజుకో వార్త ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లో వ‌స్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇప్ప‌టికీ రిమోట్ ప్రాంతాల్లో వైద్యం అంద‌డం గ‌గ‌నంగా మారిపోయింది. ఎన్టీఆర్ ఇళ్ల కేటాయింపులోనూ చేతివాటం భారీ ఎత్తున పెరిగిపోయింద‌ని ప‌త్రిక‌లు ఘోషిస్తున్నాయి. మ‌రి ఇంత జ‌రుగుతుంటే.. ప్ర‌జ‌ల్లో సంతృప్తి ఎలా ఎక్క‌డ నుంచి వెలుగు చూస్తోందో.. చంద్ర‌బాబు గ్ర‌హించాలి. సీఎం మెప్పుకోసం.. కొంద‌రు అధికారులు ఇలా సంతృప్త‌స్థాయి పేరుతో అంకెల గార‌డీ చేస్తున్నార‌న్న వ్యాఖ్య‌లు సైతం వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ సంతృప్తి బాబుకే త‌ప్ప‌.. ప్ర‌జ‌ల‌కు కాద‌నేది నిష్టు ర స‌త్యం!!