మోడీ కి దిమ్మతిరిగేలా చంద్రబాబు తాజా వ్యూహాలు     2018-05-03   01:32:02  IST  Bhanu C

కేంద్రం పై ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాటానికి అనూహ్యమైన స్పందన వస్తోంది..ఒక పక్క కేంద్రంతో డీ అంటే డీ అంటూనే మరో వైపు ఏపీ రాజకీయాలలో భవిష్యత్తు వ్యుహలపై కసరత్తులు చేస్తున్నారు అయితే ఏపీలో ఏపీలో ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా సరే కేంద్రంలో మోడీ కి మాత్రం దిమ్మ తిరిగిపోయేలా చంద్రబాబు వ్యుహాలు సిద్దంగా ఉన్నాయని అంటున్నారు టీడీపి నేతలు..నెల రోజుల పార్లమెంటు అడ్డగింత తర్వాత ఢిల్లీలో ప్రధాని నివాసం ముట్టడి తరవాత… అనూహ్యంగా చంద్రబాబు తన పుట్టినరోజు న విజయవాడలో దీక్ష చేపట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు..

అయితే ఇదే సమయంలో ఏపీ ప్రజలకి చంద్రబాబు పై మరింత నమ్మకం పెరిగింది..ఏపీకి ప్రత్యేక హోదా రావాలన్నా..కేంద్రం మెడలు వంచి తీసుకు రావాలన్నా సరే దానికి చంద్రబాబే సరైన వ్యక్తని..తెలుగుదేశం పార్టీ ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుందని ఫిక్స్ అయ్యారు..అయితే ప్రత్యేక ఉద్యమం నేను మొదలు పెట్టాను అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి, నేను ముందుకు తీసుకు వెళ్లాను అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మధ్యలోనే మోడీకి లొంగిపోవడంతో..ఆ భారం మొత్తం చంద్రబాబు పైనే పడింది..