నిలదీస్తాడా ..? నీళ్లు నములుతాడా ..? మోదీతో తాడోపేడో తేల్చేస్తానంటున్న బాబు !     2018-06-14   03:21:19  IST  Bhanu C

ఏపీ ప్రయోజనాల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా… కేంద్రం కక్షపూర్తితంగా వ్యవహరిస్తూ తీరని అన్యాయం చేస్తోందని ..ఆరోపిస్తూ గత కొంతకాలంగా టీడీపీ చేస్తున్న రాద్ధాంతం అంతా ఇంతా కాదు. నాలుగేళ్లపాటు ఎన్డీయేలో చురుకైన పాత్ర పోషించిన టీడీపీ ఆ తరువాతమారిన పరిణామాలతో బయటకి వచ్చేసింది. ఇక అక్కడి నుంచి బీజేపీ పేరు చెప్తే ఒంటి కాలిపై లేస్తోంది టీడీపీ.

ఏపీ ఇంకా అభివృద్ధి చెందకపోవడానికి కారణం మోదీనే అంటూ ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. క్రిడిట్ వస్తే నాకు లేకపోతే మోదీకి అన్నట్టు బాబు తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు.ఏ దశలో ప్రధానిపై పరుష వ్యాఖ్యల్ని చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. బహిరంగ సభల్లో రోజుకో తీరుతో మోడీపై మండిపడుతున్న బాబు తాజాగా తాను వెళ్లే నీతి అయోగ్ మీటింగ్ లో ప్రధానిని నిలదీసి తాడో పేడో తేల్చేస్తా అంటూ గంభీరంగా మాట్లాడుతున్నాడు.