Chandrababu waiting for central response

కృష్ణ జిల్లా అంటేనే టిడిపికి కంచుకోట..పశ్చిమగోదావరి జిల్లా లో టిడిపి ప్రభావితం ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువగా కృష్ణా జిల్లా లో టిడిపి హవా నడుస్తుంది.అయితే మారుతున్న రాజకీయపరినామాలు మరియు మాలీ తెరపైకి వస్తున్నా పునర్విభజన అంశం ఇప్పుడు టిడిపి కృష్ణా లో కాక పుట్టిస్తున్నాయి.ఈ పరిణామాలతో ఒకవైపు టీడీపీ నేత‌ల‌తో పాటు మరోవైపు వైసీపీ నుంచి వ‌చ్చిన జంపింగ్లు కూడా గంపెడు ఆసెలు పెట్టుకుంటున్నారు.. మ‌రోప‌క్క మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ నేత‌లు కూడా త‌మ‌కు ఎన్నో కొన్ని సీట్లు కోరే అవ‌కాశాలు లేక‌పోలేదు. మోడీ ప్రభుత్వం ఒకవేళ ఈ విషయంలో పునర్విభజన విషయంలో సానుకూలంగా ఉంటే మాత్రం టిడిపి అధ్యక్షుడికి అంతకంటే పెద్ద తలనెప్పి వ్యవహారం మరొకటి లేదు..ఇప్పటి పరిస్థితి కూడా అలానే ఉంది.

కేంద్రం నియోజకవర్గ పునర్విభజనపై సానుకూలంగా ఉన్నట్టు వస్తున్న వార్తలు ఆశావాహులకి ఎంతో బలాన్ని ఇస్తున్నాయి…నెలాఖరులో కేంద్ర క్యాబినెట్‌ ఈ పెంపుకు ఆమోద ముద్ర వేయనుందని చెబుతున్నారు. కేంద్రం ఇదే కనుక చేస్తే టీడీపీ మాత్రం గెలుపు గట్టు ఎక్కేసినట్టే అంటున్నారు నేతలు.అయితే ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో 16 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. పునర్విభజన జరిగితే మరో నాలుగు పెరుగుతాయి. విశ్లేషకుల‌ అంచనా ప్రకారం విజయవాడలో మరో నియోజకవర్గం ఏర్పడుతుంది.. నందిగామ, జగ్గయ్యపేట , మైలవరం, నియోజకవర్గాల్లో కొన్ని మార్పులు చేసి కంచికచర్ల లేదా ఇబ్రహీంపట్నం కేంద్రంగా మరో కొత్త అసెంబ్లీ సెగ్మెంట్‌గా మరే చాన్స్ ఉందని టాక్. అవనిగడ్డ ని కూడా విభజించి రెండు నియోజకవర్గాలుగా చేసే అవకాసం ఉందట.