పవన్ కి ఎన్టీఆర్ కి మధ్య పొగపెడుతున్న చంద్రబాబు..     2018-05-04   09:08:48  IST  Bhanu C

ప్రజలలో విపరీతమైన క్రేజ్ ఉన్న నటుడు పవన్ కళ్యాణ్..ఎంత క్రేజ్ ఉందంటే గత ఎన్నికల్లో జగన్ కి రావాల్సిన కుర్చీ ని లాగేసి చంద్రబాబుని కూర్చో పెట్టగాలిగేంత క్రేజ్..అందుకే గత ఎన్నికల్లో చంద్రబాబు చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టుగా 2 % తేడాతో గెలిచిపోయారు..అయితే ఎన్నికల తరువాత కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కి మద్దతుగా మాట్లాడతూ ఉండటంతో అందరూ ఈ సారి కూడా పవన సపోర్ట్ చంద్రబాబు కే ఈ సారి సీఎం కుర్చీ కూడా చంద్రబాబు కే అని ఫిక్స్ అయ్యారు..అయితే

అనూహ్యమైన పరిణామాల వలన పవన్ చంద్రబాబు కి గుంటూరు సభలో ఘలక్ ఇవ్వంతో చంద్రబాబు కి ఊహించని షాక్ తగిలింది..వేలమంది ప్రజల సాక్షిగా చంద్రబాబు లోకేష్ లు దొంగలు అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ జగన్ ని ఒక్క మాట కూడా అనక పోవడంతో ఈ సారి పవన్ సపోర్ట్ జగన్ కేనని అందరూ ఫిక్స్ అయిపోయారు..అయితే ఈ తరుణంలో చంద్రబాబు ఆలోచనలో పడ్డారు నిజంగా పవన్ కళ్యాణ్ తన ఊపుని కొనసాగిస్తూ ఏపీ లో ఎన్నికలవరకూ ఇదే టెంపో తో ఉంటే అసలుకే మోసం వస్తుందని గ్రహించిన చంద్రబాబు పవన్ జోరుకి బ్రేకులు వేసే ఉపాయాన్ని సిద్దం చేశారు..