సర్వేలతో హడలెత్తిస్తున్న బాబు ! ఈసారి టికెట్లు వారికేనా..?     2018-07-02   01:02:49  IST  Bhanu C

సర్వేలు ఆధారంగా ఎప్పటికప్పుడు జనం నాది తెలుసుకుని దానికి అనుగుణంగా అరిపాలన చేయడం ఏపీ సీఎం చంద్రబాబు స్టయిల్. అయన ఏ పథకం ప్రవేశపెట్టినా అది జనంలోకి ఎలా వెళ్ళింది అనేది తెలుసుకోవడం కోసం సర్వేలు చేయిస్తారు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో ఆయన మాములుగా ఊరుకుంటారా ..? క్యాడర్ ను పరుగులు పెట్టించేస్తున్నారు. ఎమ్యెల్యేలు నిత్యం ప్రజల్లో ఉండేలా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాడు.

ఇవన్నీ పక్కనపెడితే చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల పరిస్థితి తెలుసుకునేందుకు ఆయన సొంతంగా తయారుచేయించిన ప్రశ్నవళితో ఓ సర్వే టీమ్ ని రంగంలోకి దించాడు. ఈ సర్వే కోసం నిష్ణాణుతులైన ప్రొఫెసర్లను రంగంలోకి దించాడు. ఒక్కో జిల్లా బాధ్యతను ఇద్దరు ప్రొఫెసర్లకు అప్పగించారు. వారికి బాబు స్వయంగా తయారు చేసిన ఒక ప్రశ్నావళిని ఇచ్చారు. ఇందులో పది నుంచి పదిహేను ప్రశ్నలుంటాయి. ఈ ప్రొఫెసర్లు ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించి సమాచారాన్ని సేకరి స్తున్నారు.