బాబు కి దడ పుట్టిందా ..? కుప్పంలో ఆ సర్వే అందుకేనా ..?     2018-06-13   01:05:32  IST  Bhanu C

అందుకోసమే… తన సామజిక వర్గం ఎక్కువగా ఉండే… గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయాలనుకుంటున్నాడు. అయితే అసలు కుప్పంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? లోకేష్ పోటీ చేస్తే కచ్చితంగా గెలిచే అవకాశం ఉందా? 2014 ఎన్నికల హామీలపై కుప్పం ప్రజలు కూడా భారీగా ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు కుప్పంలో ప్రజావ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అనే విషయంపై తెదేపా రహస్యంగా సర్వేలు చేయిస్తోంది.

ఆ సర్వే చేస్తున్నవాళ్ళందరూ కూడా వైకాపా, బిజెపి, జనసేనలాంటి పార్టీల నుంచి వచ్చామని చెప్పాల్సిందిగా బాబు హుకుం జారీ చేసాడట. ఎందుకంటే… టీడీపీ నుంచి వచ్చామని చెప్తే నిజాలు చెప్పరేమో అన్న ఉద్ధేశ్యంతో ఇతర పార్టీల నుంచి వచ్చినట్టుగా చెప్పాలని చెప్పి సూచనలు చేశారేేమో అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా విజయావకాశాలపై చంద్రబాబుకు నమ్మకం లేదా అన్న ఆలోచన మాత్రం టిడిపి శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఇప్పటికే రాష్ట్రంలో జరిగిబన అనేక సర్వేలు టీడీపీ పరిస్థితి బాగాలేదని, వైసీపీ బాగా పుంజుకుందని తేల్చాయి. ఇంకా చెప్పాలంటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవబోతుందని అవి తేల్చడంతో… బాబు లో కంగారు మొదలయిందని వార్తలు వినిపిస్తున్నాయి.