చంద్రబాబు భారీ స్కెచ్ లో భాగమే.. లగడపాటి – ఏబీఎన్ సర్వే     2018-06-18   04:11:11  IST  Bhanu C

రెండు రోజుల క్రితం లగడపాటి మరియూ RG ఫ్లాష్ సర్వే సంయుక్తంగా నిర్వహించిన సర్వే అని చెప్తూ ఏబీఎన్ ఒక కధనాని ప్రచురించింది..ఏపీలో మళ్ళీ చక్రం తిప్పేది టీడీపినే అనేది ఆ సర్వే రిపోర్ట్ మళ్ళీ జగన్ కి ఏపీ ప్రజలు ఘలక్ ఇవ్వనున్నారు అని ఆ సర్వే తేల్చి చెప్పింది..అయితే అందరూ ఊహించిన విధంగానే ఈ సర్వే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే వచ్చింది..అయితే ఇంట హుటాహుటినా ఈ సర్వే రిజల్స్ ఎందుకు చేశారు….? అయితే ఇప్పుడు మాత్రం ఎందుకు సర్వే ఫలితాలు బయటపెట్టాలి..? ఎందుకంటే..

లగడపాటి రాజగోపాల్ ఏపీలో చాలా కాలంగా సర్వేలు చేస్తున్నాడు..అంతేకాదు వీలు కుదిరినప్పుడల్లా ఆయన చంద్రబాబు ని కలుస్తూ ఏకాంతంగా చర్చలు జరిపిన సందర్భాలు అనేకం ఉన్నాయి.. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకోసమే ఆయన ఈ సర్వే చేస్తున్నారనే విషయం వారిద్దరి అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలుసు. అడపాదడపా లగడపాటి రాజగోపాల్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయి తన సర్వే వివరాలను నేరుగా ఆయనకే అందిస్తున్నారు. ఆ సర్వే ఆధారంగా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు.