చంద్రబాబు వ్యూహాత్మక అడుగు ..మోడీ,షా లకి వెన్నులో వణుకు     2018-04-23   05:49:24  IST  Bhanu C

దేశంలో మోడీ పేరు చెప్తేనే ఒక ప్రభంజనం, దేశ విదేశాలలో సైతం భారతీయులు మోడీ కి బ్రహ్మరధం పట్టారు..మోడీ పేరు వింటే చాలు ఎక్కడా లేని హోరు నినాదాలు వినిపించేవి అయితే ఇదంగా గతం ఏపీ సీఎం చంద్రబాబుని డీ కొట్టక ముందు జరిగిన హడావిడి తతంగం..ఎప్పుడైతే ఏపీ పై సవతి తల్లి ప్రేమ మోడీ చూపించాడో అప్పుడే మోడీ ఫ్యూచర్ తలపండిన ,చంద్రబాబు గురించి తెలిసిన మేధావులకి అర్థం అయ్యింది..ఎంతో మంది సీనియర్ నేతలు బీజేపి చంద్రబాబు తో వైరం వద్దని వారించినా సరే మోడీ ,షా లకి చెవికెక్కలేదు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు.. కట్ చేస్తే


ఏపీ ప్రజలని మోసం చేసి, నయవంచన చేసి ఇచ్చిన హామీలని తుంగలోకి తొక్కితే సామాన్య ప్రజలకి చిర్రెత్తుకొస్తుంది మరి అలాంటిది ఏపీ సీఎం చంరబాబు నాయుడుకి ఇంకెంత కోపం రావాలి..అందుకే అప్పటిదాకా మౌనంగా ఉన్న చంద్రబాబు ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ వచ్చారు..దాంతో మోడీ షా ద్వయం ఉక్కిరిబిక్కిరి అవుతోందని తెలుస్తోంది..ఇప్పటికే దక్షినాది రాష్ట్రాలని ఒక్క తాటిపైకి తెచ్చిన చంద్రబాబు ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల నేతల్ని కూడా ఒకే వేదికపైకి తీసుకురావాలని చూస్తున్నారు..అందు కోసమే “మే 7” ని ఎంచుకున్నారు ఇప్పుడు “మే 7” అనే పేరు మోడీ కి నిద్రపట్టకుండా చేస్తోందని టాక్ వినిపిస్తోంది..