“జూన్” తరువాత “కీలక పరిణామాలు”...చంద్రబాబు “షాకింగ్ కామెంట్స్”     2018-05-12   00:52:00  IST  Bhanu C

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్నటి టీడీఎల్పీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు..తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలి అంటూ నేతలకి చెప్పారు..వచ్చే ఎన్నికల వరకూ కూడా నేతలు ఎవరూ విరామం తీసుకోవద్దని తెలిపారు…కార్యకర్తల సేవలని ఉపయోగించుకోవాలని..నేతల మధ్య సమన్వయ లోపాలు ఉంటే కలిసి కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకోలని తెలిపారు..ఇప్పుడు ఏపీలో టీడీపీ పార్టీ గెలవడం అనేది ఒక చారిత్రిక అవసరమని తెలిపారు చంద్రబాబు నాయుడు..అయితే

పార్టీ లో గొడవలు పడి కీలక సమయంలో పార్టీ పరువుని రోడ్డున పడేసే నేతలపై తీవ్రమైన చర్యలకు తీసుకుంటానని హెచ్చరించారు..ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన ఒకే ఒక్క పార్టీ టీడీపీ అని ఇదే ప్రజలు కూడా విస్వసిస్తున్నారని తెలిపారు..జగన్ బీజేపీతో లాలూచి పడి తన ఎంపీల ద్వారా రాజీనామాలు చేయించి తద్వారా లబ్ది పొందాలని ప్రయత్నాలు చేశారు కానీ ప్రజలు వాటిని నమ్మలేదు..ప్రజలు టీడీపీ కి అనుకూలంగా ఉన్నారని అన్నారు..